Allu Arha - Manchu Lakshmi: నీ యాస తేడాగా ఉంది.. నువ్వు తెలుగేనా.. మంచు లక్ష్మిని ఆటపట్టించిన అల్లు అర్జున్ కూతురు..!
Allu Arha - Manchu Lakshmi: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె, గారాలపట్టి అల్లు అర్హ తన ముద్దు ముద్దు మాటలతో మరోసారి నెట్టింట హైలైట్‌గా మారింది.
Allu Arha - Manchu Lakshmi: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె, గారాలపట్టి అల్లు అర్హ తన ముద్దు ముద్దు మాటలతో మరోసారి నెట్టింట హైలైట్‌గా మారింది. చిన్న వయస్సులోనే తన చమత్కారంతో ఆకట్టుకుంటున్న అర్హ తాజాగా నటి మంచు లక్ష్మికి వేసిన ఓ ప్రశ్నతో సోషల్ మీడియాను ఊపేస్తోంది. అర్హ అమాయకత్వానికి, తెలివితేటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇటీవల అల్లు అర్జున్ నివాసానికి మంచు లక్ష్మి అతిథిగా వచ్చారు. ఆ సమయంలో అర్హతో సరదాగా మాట్లాడుతున్న లక్ష్మి, ‘‘నన్ను ఏదైనా అడగాలనుకుంటున్నావట కదా, ఏంటది?’’ అని ప్రశ్నించారు. వెంటనే అర్హ ఏమాత్రం తడబడకుండా, ‘‘నువ్వు తెలుగేనా? తెలుగు అమ్మాయివేనా?’’ అని నిజాయితీతో నెమ్మదిగా ప్రశ్నించింది.
ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయిన మంచు లక్ష్మి నవ్వుతూ, ‘‘నేను తెలుగే పాపా... నీకు ఎందుకు ఆ డౌట్ వచ్చింది?’’ అని అడిగారు. దీనికి అర్హ కూల్‌గా, ‘‘నీ తెలుగు యాస అలా ఉంది కాబట్టి’’ అని సమాధానం ఇవ్వడంతో, లక్ష్మి నవ్వులు ఆపుకోలేకపోయారు. ‘‘నీ యాస కూడా అలా ఉంది కదా’’ అంటూ సరదాగా బదులిచ్చారు.
ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బన్నీ ఫ్యాన్స్ అర్హ క్యూట్‌నెస్‌కు, spontaneous thinkingకు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, అర్హకి సంబంధించిన వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఆ వీడియోలు ప్రతి సారి నెటిజన్లను అలరిస్తూ వైరల్ అవుతుండగా, తాజా వీడియో కూడా అదే కోవలో ఆకట్టుకుంటోంది.