100 పర్సెంట్ లవ్ కాంబో మళ్లీ రిపీట్ అవ్వనుందా

Update: 2019-02-20 06:39 GMT

గత కొంతకాలంగా వరుస ఫ్లాఫ్ సినిమాలతో యువ హీరో అక్కినేని నాగచైతన్య మార్కెట్ బాగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఇది పక్కన పెడితే తన మొట్టమొదటి బ్లాక్బస్టర్ను 100% లవ్ సినిమాతో అందుకున్నాడు చై. 2010 లో తమన్నా హీరోయిన్ గా అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు నాగచైతన్య అల్లు అరవింద్ తో చేయి కలపనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మెగా ప్రొడ్యూసర్ అక్కినేని హీరో సినిమాకు నిర్మాతగా మారనున్నారు.

ఈ మధ్యనే 'గీతగోవిందం' సినిమాతో మర్చిపోలేని సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే నాగచైతన్య తో ఈ సినిమా గురించి డిస్కషన్ చేశారట. ఈ సినిమా గురించి నాగ చైతన్య ఇంకా తన అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ సినిమా గురించి పక్కన పెడితే అక్కినేని యువ హీరో అఖిల్ కూడా గీతా ఆర్ట్స్ పతాకంపై ఓ సినిమా చేయనున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కనున్న ఒక చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

Similar News