Akkineni Akhil : ఆఫీషియల్ : అఖిల్ తో సురేందర్ రెడ్డి!
Akkineni Akhil : అఖిల్ అక్కినేని..చేసిన మూడు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.. ఇప్పుడు నాలుగో ప్రయత్నంగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'
Akkineni akhil new movie announced with director surendar reddy under Ak entertainment production
Akkineni Akhil : అఖిల్ అక్కినేని..చేసిన మూడు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.. ఇప్పుడు నాలుగో ప్రయత్నంగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే సినిమాని చేస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్ నిర్మిస్తుంది. తాజాగా తన తదుపరి సినిమాని అనౌన్స్ చేశాడు అఖిల్.. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాని చేస్తున్నాడు అఖిల్.. ఇది అఖిల్ కి ఐదో సినిమా కాగా, సురేందర్ రెడ్డికి పదో సినిమా కావడం విశేషం..
ఈ సినిమాని సరిలేరు నీకేవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి వక్కంతం వంశీ కథను అందిస్తున్నాడు. సైరా లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి నుంచి సినిమా వస్తుండడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి సంబంధించిన అప్డేట్ లను త్వరలోనే అనౌన్సు చేయనున్నారు.
ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. దాదాపుగా 70 శాతం కంప్లీట్ అయిన ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ నుంచి చాలా గ్యాప్ తరవాత వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి.
The Much Awaited Announcement Is Here🔥🤘💥
— AK Entertainments (@AKentsOfficial) September 9, 2020
Young & Dynamic Hero @AkhilAkkineni8🔥 Joins Hands With Stylish & Star Director @DirSurender⚡For ⭐⭐⭐⭐⭐#Akhil5 @AnilSunkara1 @AKentsOfficial @S2C_Offl @VamsiVakkantham
More Details Soon pic.twitter.com/6U5WZQISIy