Most Eligible Bachelor Movie Update: అఖిల్ సినిమాకి అదిరిపోయే శాటిలైట్ ఆఫర్!

Most Eligible Bachelor Movie Update: ఒక్క హిట్ కోసం తహతహలాడుతున్నాడు అక్కినేని హీరో అఖిల్..

S. Srikanth
Updated on: 5 Aug 2020 3:07 PM IST
Most Eligible Bachelor Movie Update: అఖిల్ సినిమాకి అదిరిపోయే శాటిలైట్ ఆఫర్!
X
Most Eligible Bachelor (file photo)

Most Eligible Bachelor Movie Update: ఒక్క హిట్ కోసం తహతహలాడుతున్నాడు అక్కినేని హీరో అఖిల్.. చేసిన మూడు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.. ఇప్పుడు నాలుగో ప్రయత్నంగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా, బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అల్లు అరవింద్‌ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాదు ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది. అయితే అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్,హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా చేస్తున్న ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అఖిల్.

దాదాపుగా 70 శాతం కంప్లీట్ అయిన ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసిన ఓ పోస్టర్ లో పొంగల్ 2021అంటూ క్లారిటీ ఇచ్చారు మేకర్స్.. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అఖిల్ ఫస్ట్ లుక్, సిద్ శ్రీరామ్ సాంగ్, పూజా హెగ్డే లుక్‌కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చి సినిమా పైన మంచి అంచనాలను పెంచేసింది. కరోనా కారణంగా లాక్ డౌన్ తో ఖాళీ సమయం దొరకడంతో అఖిల్ సినిమా ఎలా వచ్చిందో అని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' మూవీ రఫ్ ఎడిటింగ్ అయిన సినిమా మొత్తాన్ని నాగార్జున చూసారట.. అదేవిదంగా సినిమా అవుట్ పుట్ చాల బాగుందని.. నాగార్జున సంతోషంగా ఉన్నారని తెలుస్తుంది.

అయితే, ఇక్కడ మేకర్స్ కి ఊరట విషయం ఏమంటే.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌' చిత్రం రిలీజ్ కంటే ముందే నాన్ థియేట్రికల్ బిజినెస్‌ రూపంలో మంచి ఆఫర్ వచ్చిందని వచ్చిందట. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్టార్ మా ఆరున్నర కోట్ల రూపాయలకు ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతంచేసుకున్నాటు సమాచారం. ఇక గతంలోనీ ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే.


S. Srikanth

S. Srikanth

Next Story