Most Eligible Bachelor New Poster: సంక్రాంతికి అక్కినేని అఖిల్ 'బ్యాచిలర్'..

Most Eligible Bachelor New Poster: సంక్రాంతికి అక్కినేని అఖిల్ బ్యాచిలర్..
x
Akhil Akkineni's Most Eligible Bachelor to release on Pongal 2021
Highlights

Most Eligible Bachelor New Poster: ఒక్క హిట్ కోసం తహతహలాడుతున్నాడు అక్కినేని హీరో అఖిల్.. చేసిన మూడు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.. ఇప్పుడు

Most Eligible Bachelor New Poster: ఒక్క హిట్ కోసం తహతహలాడుతున్నాడు అక్కినేని హీరో అఖిల్.. చేసిన మూడు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.. ఇప్పుడు నాలుగో ప్రయత్నంగా 'బ్యాచిలర్' అనే సినిమాని చేస్తున్నాడు అఖిల్.. ఈ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా, బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. అల్లు అరవింద్‌ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ఇందులో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

దాదాపుగా 70 శాతం కంప్లీట్ అయిన ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసిన ఓ పోస్టర్ లో పొంగల్ 2021అంటూ క్లారిటీ ఇచ్చారు మేకర్స్.. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అఖిల్ ఫస్ట్ లుక్, సిద్ శ్రీరామ్ సాంగ్, పూజా హెగ్డే లుక్‌కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చి సినిమా పైన మంచి అంచనాలను పెంచేసింది.

ఇక మిగిలిన 70 శాతం షూటింగ్ ని కరోనా వైరస్ ప్రభావం తగ్గగానే చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న గొపీసుంద‌ర్‌ ఇప్పటికే పాటలను సిద్దం చేశాడు. అతి త్వర‌లో డ‌బ్బింగ్ కార్యక్రమాలు మెద‌లు పెట్టబోతున్నారు.ప్రస్తుతం పోస్ట్ ప్రోడ‌క్షన్ పనులు శేరవేగంగా జరుపుకుంటున్నాయి. ఆమని, మురళీశర్మ, జయప్రకాష్‌, ప్రగతి, సుడిగాలి సుధీర్‌ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పైన అక్కినేని అభిమానులు భారీగానే అంచనాలను పెట్టుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories