డ్రగ్స్ కేసు: ఎన్‌సీబీ విచారణకు హాజరైన రకుల్!
Rakul Preet Singh Arrives At NCB Office : డ్రగ్స్ కేసులో గత కొద్దిరోజులుగా ఆరోపణలు ఎదురుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నేడు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ ) విచారణకు హాజరైంది.
Rakul Preet Singh Arrives At NCB Office
Rakul Preet Singh Arrives At NCB Office : డ్రగ్స్ కేసులో గత కొద్దిరోజులుగా ఆరోపణలు ఎదురుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నేడు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ ) విచారణకు హాజరైంది. రెండు రోజుల క్రితం విచారణకు హాజరుకావల్సిందిగా ఆమెకి ఇటివల ఎన్‌సీబీ నోటిసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. ఎన్‌సీబీ పిలుపుమేరకు గురువారమే ఆమె గోవా నుంచి ముంబై చేరుకుని శుక్రవారం ఉదయం ఎన్‌సీబీ ముందు హాజరైంది.
ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్న ఆమెను అధికారులు విచారించనున్నారు. రియా చక్రవర్తితో గతంలో రకుల్ చేసిన చాటింగ్ బయటకు రావడంతో దీనిపై ఆమెను పలు కోణాల్లో ప్రశ్నించనున్నారు. అటు రేపు దీపికా పదుకొణె విచారణకు హాజరు కానుంది. ఈ కేసులో సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్‌లకూ ఇప్పటికే నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో సమన్లు జారీ చేసింది.
ఇక బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసులో ఈ డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపైన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి ) విచారణ చెప్పట్టింది.. అయితే ఈ కేసులో ముందు నుంచి కీలక సూత్రధారిగా ఉన్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఎన్‌సిబి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ విచారణలో రియా చిత్ర పరిశ్రమకు చెందిన 25 మంది సెలబ్రిటీల పేర్లను చెప్పినట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. రియా చెప్పినట్టుగా ఎన్‌సిబి కూడా అధికారికంగా పలువురు పేర్లను వెల్లడించింది. ఈ క్రమంలో రకుల్ ని విచారణకి పిలిచారు అధికారులు..