Actress Raasi: ఇది నాకు సెకండ్ ఇన్నింగ్స్ కాదు : రాశి
Actress Raasi: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన బాలగోపాలుడు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రాశి..
Actress Raasi: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన బాలగోపాలుడు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రాశి.. ఇక ఆ తరవాత పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గోకులంలో సీత సినిమాతో హీరోయిన్ గా మారింది.. ఇక శుభాకాంక్షలు, అమ్మో ఒకటో తారీఖు, శ్రీరామచంద్రులు, చెప్పాలని ఉంది, పెళ్లి పందిరి, ప్రేయసి రావే మొదలగు సినిమాలలో నటించి హీరొయిన్ గా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.. హీరోయిన్ గా సినిమాలు తగ్గుతున్న సమయంలో తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమాలో ఓ పవర్ఫుల్ పాత్రలో నటించి మెప్పించింది రాశి..ఇక పెళ్లి తర్వాత సినిమాలకి కొంచెం బ్రేక్ ఇచ్చిన రాశి ఆ తరవాత నాగశౌర్య హీరోగా వచ్చిన కళ్యాణ వైభోగమే అనే సినిమాలో హీరోయిన్ కి తల్లి పాత్రలో కనిపించింది. ఇక ప్రస్తుతం సీరియల్స్, సినిమాల్లోకి నటించేందుకు ఆసక్తి చూపిస్తుంది..
ఈ రోజు (జూన్29) రాశి పుట్టినరోజు కావడంతో ఓ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది రాశి.. ఇన్నేళ్ల సినీ జీవితాన్ని వెనుకకు తిరిగి చూసుకుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.. చాలా సినిమాల్లో మంచి పాత్రలు పోషించనని అన్నారు.. అయితే తనది సెకండ్ ఇన్నింగ్స్ అని అంటున్నారు కానీ తాను ఎప్పుడు సినిమాలని ఆపలేదని, పరిస్థితుల్ని బట్టీ కాస్త తగ్గించానంతే అంటూ చెప్పుకొచ్చింది రాశి..మంచి పాత్రలు వస్తే చేయడానికి తాను సిద్ధమేనని చెప్పుకొచ్చింది రాశి.. ప్రస్తుతం తెలుగులో రెండు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నట్టుగా వెల్లడించింది.. ఇక తన భర్త డైరెక్షన్లో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది..