Top
logo

సుస్వరాల మాంత్రికుడు 'ఇళయరాజా'కు పుట్టినరోజు జేజేలు!

సుస్వరాల మాంత్రికుడు
X
Highlights

మధురమైన ప్రేమలో తేలిపోతూ ఆమనీ పాడవే తీయగా అని పాడుకున్నా..అదే ప్రేమలో మాటే మంత్రమూ..మనసే బంధమూ అని రాగాలు...

మధురమైన ప్రేమలో తేలిపోతూ ఆమనీ పాడవే తీయగా అని పాడుకున్నా..

అదే ప్రేమలో మాటే మంత్రమూ..మనసే బంధమూ అని రాగాలు పోయినా

సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా.. అంటూ లోకం తెలీని వాడు అమాయకంగా పాట అందుకున్నా..

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది.. అంటూ మదిలో చెలరేగుతున్న బాధని ఓ యువకుడు వ్యక్తం చేసినా..

హే పాండురంగా.. హే పండరి నాధా శరణం శరణం అంటూ భక్తుడు గానామృతాన్ని పంచినా..

సన్నివేశం ఏదైనా.. సందర్భం ఎలాంటిదైనా.. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ముందు ఆయన సంగీతామృతంలో తెలిపోతాడు. నటులతో పనిలేదు.. దర్శకుడెవరో అవసరం లేదు.. సినిమా ఎలా ఉందొ అంతకంటే అక్కరలేదు. ఆ స్వరరాజు సంగీతం ఉందా చాలు. ఒక్కసారన్నా ఆ సినిమా చూడాల్సిందే! ఇలా సామాన్య వీక్షకుడు కూడా భావించే సుస్వర సంగీత భాస్కరుడు. ఇంత చెప్పక్కర్లేదు. ఈపాటికే మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఎవరి గురించి చెబుతున్నామో..అవును.. మాస్ట్రో 'ఇళయరాజా' గురించే! ఇప్పుడెందుకు ఇదంతా అనుకుంటున్నారా..ఈరోజు (జూన్ 02) అయన పుట్టినరోజు. అందుకే ఆ సంగీత జ్ఞాని గురించి నాలుగు మాటలు.

ఎన్ని అక్షరాల మూతలు పోగేసినా అయన సంగీతం గురించి నాలుగు మాటలు రాయలేం. ఎందుకంటే, ఆయన పేరు తలుచుకోగానే 'మంచు కురిసే వేళలో' అంటూ ఓ మల్లెల్ల విరివాన మన మనసులను అలా తాకుతూ వెళ్ళిపోతుంది. అయన సంగీతం అనుకునే లోపు '''అబ్బ నీ తీయని దెబ్బ'' అంటూ సున్నితంగా చెవులలో ఆ స్వర మాధుర్యం వినిపించేస్తుంది. అయన పాటలు అని అనుకుంటే చాలు ఒకటా రెండా వేలాది పాటలు అన్నీ కలగా పులగం అయిపోయి.. ''అరె ఏమైందీ'' అంటూ మనల్ని సంగీత మాధుర్యం చుట్టూ ముట్టేస్తుంది. ''గిలిగా..గిలిగిలిగా గిలిగింతగా..'' మనలని మరో ప్రపంచంలోకి తీసుకుపోయే ఇళయరాజా సంగీతాన్ని వర్ణించడం ఎవరివల్ల అవుతుంది?

జ్ఞానదేశికన్ పేరుతో 1943 జూన్ 02 వతేదీన పుట్టిన ఇప్పటి ఇళయరాజా వెండితెరపై సుస్వరాల వెన్నెల వెలుగులు పరిచారు. పరుస్తున్నారు. ఆయన గురించి కొన్ని ముచ్చట్లు ఇవి..

- నాలుగు సార్లు ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ పురస్కారాలను పొందారు.

- 1993 సంవత్సరంలో లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్హర్మోనిక్ ఆర్కెస్ట్రాతో ఒక పూర్తి స్తాయి "సింఫనీ"ని కంపోస్ చేసి, ఆర్కెస్ట్రా చేయించి రికార్డు చేసారు. ఆసియా ఖండంలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఈయనే.

- 2003 లో బీబీసీ న్యూస్ చానల్ నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో 155 దేశాల నుండి 1991 లో వచ్చిన మణిరత్నం "దళపతి" సినిమాలో "అరె చిలకమ్మా" పాటకు ప్రపంచ టాప్ 10 మోస్ట్ పాపులర్ సాంగ్స్ ఆఫ్ ఆల్ టైం 10 పాటలలో 4వ స్థానాన్ని ఇచ్చారు ప్రజలు.

- ప్రఖ్యాత న్యూస్ ఛానల్ సి.ఏన్.ఏన్-ఐ.బీ.ఏన్. వాళ్ళు 100 ఏళ్ళ భారత సినీ పరిశ్రమ పండగను పురస్కరించుకుని నిర్వహించిన సర్వేలో 49% మంది ఇళయరాజా ను భారతదేశ ఉత్తమ సంగీత దర్శకుడుగా ప్రజలు ఎన్నుకున్నారు.

- 2018 లో భారత ప్రభుత్వం ఈయనను "పద్మవిభూషణ్" పురస్కారంతో సత్కరిచింది.

ఇవి ఇళయరాజా గురించిన చాలా చిన్న విశేషాలు మాత్రమె. మాస్ట్రో ఇళయరాజా గురించి చెప్పుకోవడం కంటే ఆయన పాటలు ఒక్కసారి వింటే మనసు మురిసిపోడూ..మరెందుకు ఆలస్యం..ఇళయరాజాకు పుట్టినరోజు జేజేలు చెబుతూ ఆ పని కానిచ్చేయండి!

Web TitleHappy birthday to Mastro Ilairaja a special story
Next Story