Aishwarya Rai :సెల్ ఫోన్ కూడా లేదు..ఆరాధ్యను ఐశ్వర్య ఎందుకు ఎంత స్ట్రిక్ట్‌గా పెంచుతున్నారో తెలుసా?

Aishwarya Rai : బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ మధ్య సంబంధాల గురించి గత కొద్ది కాలంగా వివిధ రకాల చర్చలు నడుస్తున్నాయి.

Update: 2025-12-13 05:30 GMT

Aishwarya Rai :సెల్ ఫోన్ కూడా లేదు..ఆరాధ్యను ఐశ్వర్య ఎందుకు ఎంత స్ట్రిక్ట్‌గా పెంచుతున్నారో తెలుసా?

Aishwarya Rai: బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ మధ్య సంబంధాల గురించి గత కొద్ది కాలంగా వివిధ రకాల చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే పుకార్లు జోరందుకున్నాయి. అయితే ఈ చర్చలపై అభిషేక్ గానీ, ఐశ్వర్య గానీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఈ పుకార్లలో నిజం లేదని తేలగా ఇప్పుడు అభిషేక్ బచ్చన్ తొలిసారిగా తమ కూతురు ఆరాధ్య బచ్చన్ పెంపకం గురించి, ఈ పుకార్ల గురించి మాట్లాడారు.

ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్య బచ్చన్‌తో తరచుగా ఎయిర్ పోర్టుల్లో కనిపిస్తుంటారు. అయితే ఆమె బచ్చన్ కుటుంబ సభ్యుల్లో ఎవరితోనూ కనిపించకపోవడంతో, ఐశ్వర్య, బచ్చన్ కుటుంబం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయనే ప్రచారం జరిగింది. ఇటీవల అనంత అంబానీ పెళ్లికి కూడా ఐశ్వర్య, బచ్చన్ కుటుంబంతో కాకుండా తన కూతురితో విడిగా రావడం ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది.

తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, అభిషేక్ బచ్చన్‌ను 'మీ విడాకుల గురించి వస్తున్న పుకార్లు మీ కూతురు ఆరాధ్యకు ఏమైనా తెలుసా?' అని అడిగారు. దీనికి అభిషేక్ స్పందిస్తూ తనకు తెలిసినంతవరకు ఆరాధ్యకు దాని గురించి ఎలాంటి సమాచారం లేదు అని బదులిచ్చారు.

ఆరాధ్య పెంపకం గురించి అభిషేక్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆరాధ్య వద్ద తనకంటూ ఫోన్ కూడా లేదు అని అభిషేక్ తెలిపారు. ఆమె చాలా మంచి అమ్మాయి అని, బాగా అర్థం చేసుకుంటుందని చెప్పారు. "ఐశ్వర్య ఆమెకు చాలా మంచి విలువలను అందించింది. ఆరాధ్య తన స్నేహితులకు కాల్ చేయడానికి అమ్మ (ఐశ్వర్య) ఫోన్‌ను మాత్రమే ఉపయోగిస్తుంది. ఆమె చదువుకోవడం, స్కూల్‌కు వెళ్లడం ఇష్టపడుతుంది. ఆమె గూగుల్‌లో మా పేర్లు వెతకకూడదనేది నా ఉద్దేశం" అని అభిషేక్ అన్నారు. ఈ మాటలను బట్టి చూస్తే ఆరాధ్యను చాలా కట్టుదిట్టంగా, మీడియా, సోషల్ మీడియా ప్రభావాలకు దూరంగా పెంచేందుకు ఈ స్టార్ జంట ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ పెంపకం విధానంపై చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News