మీ అభిమానానికి ధన్యవాదములు.. దయచేసి వ్యక్తి గతంగా రావద్దు: బాలకృష్ణ

నట సింహం నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు బహిరంగ లేక రాసారు.

admin
Updated on: 10 Jun 2020 12:03 PM IST
మీ అభిమానానికి ధన్యవాదములు.. దయచేసి వ్యక్తి గతంగా రావద్దు: బాలకృష్ణ
X
Nandamuri Balakrishna(File Photo)

నట సింహం నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు బహిరంగ లేక రాసారు. బుధవారం తన 60వ పుట్టిన రోజు జరుపుకుంటున్న బాలకృష్ణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కారణంగా అభిమానులు ఎవరు తనను పర్సనల్ గా కలవొద్దని విజ్ఞప్తి చేసారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా అభిమానులందరికి నా ఆత్మీయ విజ్ఞప్తి.. నా ''60వ పుట్టిన రోజు"ని మీ ఇంటి పండగలా కానీ, వినీ ఎరుగని రీతిలో చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా హితులు, శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యులైన మీ అందరితో కలిసి చేసుకొనే అదృష్టానికి అంతరాయం ఏర్పడినందుకు బాధగా ఉంది. ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మీ అందరి గురించి ఆలోచించడం నా భాద్యత. మీ క్షేమమే నాకు కొండంత ఆశీర్వాదం.

ప్రభుత్వ నిబంధనలు, ఆంక్షలు, భౌతికదూరం పాటించడం మనందరి కర్తవ్యం. అందుకే నన్ను కలవాలన్న నా ఆకాంక్షకి అడ్డుకట్ట వేసుకోవాల్సిన పరిస్థితివచ్చింది. దయచేసి మీ ఆరోగ్యాల్ని నిర్లక్ష్యం చేసి ఎవరూ నన్ను కలవడానికి రావద్దని కోరుతున్నాను.

ఈ రోజు ద్వారక క్రియేషన్స్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో నేను నటిస్తున్న చిత్రం టీజర్, మరియు నేను పడిన పాట విడుదల కాబోతున్నాయి... ఆశీర్వదించండి. ప్రభుత్వ నిబంధనలను పాటించండి. నిండు మనసుతో నా విన్నపాన్ని మన్నించండి. మీ బ్రతుకు ముఖ్యం... మీ భవిత ముఖ్యం. మీ అందరి క్షేమమే మీరు నాకు ఇచ్చే అద్భుతమైన ఆశీర్వాదం. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నా.. అంటూ బాలకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు.




admin

admin

Next Story