జీరో సైజు లోకి కీర్తి సురేశ్.. ఫాన్స్ షాక్!
Keerthy Suresh New Look : సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది హీరోయిన్ కీర్తి సురేష్.. ఎప్పటికప్పుడు తన సినిమా అప్డేట్ లను అభిమానులతో పంచుకుంటుంది ఈ భామ..
Keerthy Suresh New Look : సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది హీరోయిన్ కీర్తి సురేష్.. ఎప్పటికప్పుడు తన సినిమా అప్డేట్ లను అభిమానులతో పంచుకుంటుంది ఈ భామ.. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో మాత్రం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోలో కీర్తి జీరో సైజ్ లో స్లిమ్ గా కనిపించడమే దీనికి కారణం.. ఎప్పుడు బొద్దుగా కనిపించే కీర్తి సురేష్ అలా సన్నగా అయిపోయేసరికి అభిమానులతో పాటుగా నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.. ఒక కప్పు కాఫీ తనకు ఎంతో ఉత్సాహాన్నిస్తుందని... పరిస్థితులు ఎలా ఉన్నా తాను ఒక కప్పు కాఫీ తాగుతానని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. లాక్ డౌన్ టైంలో అమ్మడు ఆరోగ్యంపై బాగా ఫోకస్ చేసి ఇలా మారి ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఇక నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది హీరోయిన్ కీర్తి సురేష్. ఆ తర్వాత నాని హీరోగా నటించిన నేను లోకల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాలో అలనాటి తార సావిత్రి పాత్రను పోషించి అందరిచేత ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకి గాను జాతీయ అవార్డును సొంతం చేసుకుంది కీర్తి సురేష్.. ఇక తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాలో మెరిసింది..ఇక ఇటీవలే పెంగ్విన్ మూవీతో అలరించింది ఈ బ్యూటీ...
ఈ సినిమా తర్వాత మరికొన్ని ప్రాజెక్టులను కూడా లైన్ లో పెట్టింది కీర్తి సురేష్..మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ చిత్రాలు మహిళ ప్రాధాన్యం ఉన్న చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి. ఇక అటు నితిన్ తో చేస్తున్న రంగ్ దే చిత్రం చివరి దశకు చేరుకుంది. అంతేకాకుండా మహేష్ బాబు హీరోగా వస్తున్న సర్కారు వారి పాట అనే చిత్రంలో కూడా కీర్తి నటిస్తోంది. మరోవైపు తమిళంలో రజనీకాంత్, శివ కాంబినేషన్‌లో వస్తున్న మరో సినిమాలో కూడా కీర్తి కీలక రోల్‌లో కనిపించనుంది.