'రంగ్ దే' షూటింగ్ మొదలైంది!

రంగ్ దే షూటింగ్ మొదలైంది!
x

nithin 

Highlights

Nithin Rang De : కరోనా ప్రభావం వలన నష్టపోయిన రంగాలలో సినిమా రంగం కూడా ఒకటి.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని సినిమా షూటింగ్ లు వాయిదా పడ్డాయి. తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలతో మళ్ళీ సినిమా షూటింగ్ లు మొదలు అవుతున్నాయి..

Nithin Rang De : కరోనా ప్రభావం వలన నష్టపోయిన రంగాలలో సినిమా రంగం కూడా ఒకటి.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని సినిమా షూటింగ్ లు వాయిదా పడ్డాయి. తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలతో మళ్ళీ సినిమా షూటింగ్ లు మొదలు అవుతున్నాయి.. ఇప్పటికే నాగార్జున తన వైల్డ్ డాగ్ సినిమాని మొదలు పెట్టగా, నాగ చైతన్య లవ్ స్టొరీని సెట్స్ పైకి తీసుకువెళ్ళాడు..

అందులో భాగంగానే యంగ్ హీరో నితిన్ కూడా తన అప్ కమింగ్ మూవీ "రంగ్ దే" షూటింగ్ ని మొదలు పెట్టాడు.. హైదరాబాద్‌లో ఈసినిమా షూటింగ్‌ ఈ రోజు ప్రారంభమైంది. సరైన భద్రతా ప్రమాణాల్ని పాటిస్తూ పూర్తి జాగ్రత్తలతో చిత్రీకరణ జరుపుతున్నారు మేకర్స్ . దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి..

ఈ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది... తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.. ఈ సినిమాకి ఓ నెల రోజల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ మాత్రమే ఉందని సమాచారం..

ఇక నితిన్ కి ఇది 29 వ చిత్రం కావడం విశేషం.. తాజాగా ఈ ఏడాది భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన చాలా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాతో పాటుగా గాంధీ మెర్లపాక దర్శకత్వంలో అందుధాన్ రీమెక్, విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో, కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమాని లైన్ లో పెట్టాడు నితిన్.

Show Full Article
Print Article
Next Story
More Stories