Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ మంట పెట్టాడుగా!

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ మంట పెట్టాడుగా!
x
Highlights

Bigg Boss 4 : అందరి మధ్యలో చిచ్చు పెట్టాడు బిగ్ బాస్. మొదటి సారిగా ఈ సీజన్ లో గ్రూపులుగా ఇంటి సభ్యులు స్పష్టంగా మారిపోయారు.

చక్కగా అంతా కలిసి ఆడుకుంటే బిగ్ బాస్ కి నచ్చదు కదా.. ఆవిషయమే కదా నిన్న నాగార్జున చెప్పారు. అందుకే అందరి మధ్యలో చిన్న అగ్గిపుల్ల గీసి చక్కగా వెళ్ళిపోయారు నాగార్జున. ఆ అగ్గిపుల్లతో మంట పెట్టేశాడు బిగ్ బాస్ ఈరోజు హౌస్ లో.. అందరి మధ్యలో మంట పెట్టి ఒక్కోరు ఇద్దరినీ ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటోలు మంటలో వేయాలని చెప్పాడు. ఇక ఆదివారం ఫేక్ ఎలిమినేషన్ లో సేవ్ అయిన హారిక సుజాత పై పీకల వరకూ కోపం పెంచుకుంది. నామినేషన్ లె ఈ ఎపిసోడ్ ముఖ్యాంశంగా మారింది. రాజశేఖర్ మాస్టర్ ఇప్పటివరకూ రేషన్ డీలర్‌గా ఉండగా.. కొత్త రేషన్ డీలర్‌ను ఎన్నుకున్నారు ఇంటి సభ్యులు. అభిజిత్‌ను ఏకాభిప్రాయంతో ఇంటికి కొత్త రేషన్ డీలర్‌గా ఎన్నుకున్నారు.

బిగ్ బాస్ లో మామూలుగా అందరూ ఆదివారం జరిగిన సంఘటనలపై డిస్కషన్ పెట్టారు. అభిజిత్, హారిక, మోనాల్ ముగ్గురూ కూచుని దానిమీద ఎక్కువ మాట్లాడుకున్నారు. తరువాత నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది.

దేవి ఇప్పటికే కల్యాణి వేసిన బిగ్ బాంబ్ తో నామినేషన్ లో ఉంది. ఇక బిగ్ బాస్ నోయల్ కు హౌస్ కెప్టెన్ గా ఓ చాన్స్ ఇచ్చారు. నేరుగా ఒకరిని నామినేట్ చేయమన్నాడు. దాంతో నోయల్ లాస్యను నామినేట్ చేశాడు. తరువాత అక్కడ ఉన్న మంటలో ఇద్దరి ఫోటోలు వేయడం ద్వారా నామినేషన్ ప్రక్రియ కొనసాగించాలని అందరికీ చెప్పాడు బిగ్ బాస్. దీంతో మెహబూబ్ - అరియానా గ్లోరీ, హారిక లను, దేవి - రాజశేఖర్ మాస్టర్, కుమార్ సాయిలను, దేత్తడి హారిక - మొహబూబ్, సుజాతలను, అవినాష్ - మొహబూబ్, హారికలను, దివి - మొనాల్ గజ్జర్, కుమార్ సాయిలను, అభిజిత్ - అరియానా గ్లోరి, సుజాతలను, కుమార్ సాయి - మెహబూబ్, అఖిల్ సార్థక్లను, గంగవ్వ - కుమార్ సాయి, మొనాల్ గజ్జర్ లను, రాజ శేఖర్ - అరియానా గ్లోరి, కుమార్ సాయి లను, మొనాల్ గజ్జర్ - అరియానా గ్లోరి, దివి లను, అఖిల్ సార్థక్ - కుమార్ సాయి, అరియానా గ్లోరి లను, సొహైల్ - అరియానా గ్లోరి, కుమార్ సాయి లను, లాస్య - కుమార్ సాయి, అరియానా గ్లోరి లను, అరియానా గ్లోరీ - మొనాల్ గజ్జర్, మెహబూబ్ లను, జోర్దార్ సుజాత - దేత్తడి హారిక, అభిజిత్ లను నామినేట్ చేస్తున్నట్టు వారి ఫోటోలు మంటల్లో పడేశారు.

దీంతో ఈవారం నామినేషన్లలో ఏడుగురు కంటెస్టెంట్లు యాంకర్ దేవి, లాస్య, అరియానా గ్లోరి, కుమార్ సాయి, మెహబూబ్, మోనాల్ గజ్జర్, హారికలు నామినేట్ అయ్యారు.

సోహైల్ నీ కథలు నాకు తెలుసు..

నామినేషన్ ల ప్రక్రియ సందర్భంగా సోహైల్ అరియానా తో గొడవ వేసుకున్నాడు. తను యాటిట్యూడ్ చూపిస్తుందని చెప్పాడు. దాంతో ఇద్దరి మధ్యా హాట్ హాట్ గొడవ జరిగింది. ఒకరిని ఒకరు నీ సంగతి నాకు తెలుసులే అంటే.. నీ సంగతి నాకూ తెలుసంటూ మాటలు విసురుకున్నారు.

మొత్తమ్మీద నామినేషన్ ప్రక్రియ హౌస్ లో అగ్గి రాజేసింది. ఈ ఎపిసోడ్ హైలైట్ ఏమిటంటే.. గంగవ్వ నామినేషన్ లో భాగంగా ఫోటోలు మంటల్లో వేసి వస్తూ.. నెత్తి కొట్టుకుని ఇసుమంటిది ఎక్కడా సూదలేదని అనుకోవడం. అవును మరి ఫోటోలు కాల్చడం అనేది చాలా మంది అనర్ధంగా భావిస్తారు. ముఖ్యంగా పల్లెల్లో.. అందుకే గంగవ్వ అలా అనుకుంది.

ఈవారం బిగ్ బాస్ నుంచి ఎవరు బయటకు వెళ్లిపోతారని అనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి

ఇది అధికారిక పోల్ కాదు.. మరిన్ని బిగ్ బాస్ విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
Next Story
More Stories