అప్పుడు నాగార్జున.. ఇప్పుడు మహేష్ బాబు

ఇండస్ట్రీలో సొగసు చూడతరమా సినిమా తరవాత మంచి పాత్రల కోసం ఎదురుచూసనని కానీ దక్కలేదని అన్నారు. అయితే కళాతపస్వి కే విశ్వనాద్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలం సినిమాలో భానుప్రియ పాత్ర తనకి డ్రీం రోల్ అని చెప్పుకొచ్చింది

Update: 2020-11-14 11:24 GMT

యమలీల చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నటి ఇంద్రజ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాదాపుగా తెలుగులో ముప్పైకి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఇంద్రజ మలయాళ సినిమాల్లో అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకి దూరంగా ఉన్న ఇంద్రజ మళ్ళీ శతమానం భవతి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాలో నభా నటేష్ కి తల్లిగా నటిస్తున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే దీపావళి సందర్బంగా HMTV ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది ఇంద్రజ.. ఇండస్ట్రీలో సొగసు చూడతరమా సినిమా తరవాత మంచి పాత్రల కోసం ఎదురుచూసనని కానీ దక్కలేదని అన్నారు. అయితే కళాతపస్వి కే విశ్వనాద్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలం సినిమాలో భానుప్రియ పాత్ర తనకి డ్రీం రోల్ అని చెప్పుకొచ్చింది ఇంద్రజ.. ఆ సినిమా తనకి చాలా ఇష్టమని వెల్లడించింది.

ఇంటర్వ్యూలో మరికొన్ని విషయాలు :

ఇష్టమైన దర్శకుడు ఎవరు ?

ఇంద్రజ : గుణశేఖర్

ఇష్టమైన నటుడు ?

ఇంద్రజ : నేను నటనలో ఉన్నపుడు నాగార్జున.. ఇప్పుడు మహేష్ బాబు

ఇష్టమైన హీరోయిన్ ?

ఇంద్రజ : భానుప్రియ అంటే ఇష్టం.. అల్ టైం అంటే జయప్రద.. ఆమె చేసిన అన్ని పాత్రలు ఇష్టమే..

ఇష్టమైన గాయకులు?

ఇంద్రజ : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

ఇష్టమైన కోరియోగ్రఫర్

ఇంద్రజ : కళా మాస్టర్, ప్రభుదేవా

ఇష్టమైన కమెడియన్

ఇంద్రజ : తమిళ్ లో నగేష్, తెలుగులో బ్రహ్మానందం

ఇష్టమైన పాట ?

సొగసు చూడతరమా సినిమాలోని అన్ని పాటలు

నటించిన సినిమాలో టాప్ త్రీ మూవీస్?

యమలీల, సొగసు చూడతరమా, పెద్దన్నయ్య

Full View


Tags:    

Similar News