నా సెకండ్ ఇన్నింగ్స్ కి ఆయనే కారణం : ఇంద్రజ

కమెడియన్ అలీ హీరోగా యస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది నటి ఇంద్రజ. అయితే ముందుగా ఆమె జంతర్ మంతర్ సినిమాల్లో నటించింది

Update: 2020-11-14 10:38 GMT

కమెడియన్ అలీ హీరోగా యస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది నటి ఇంద్రజ. అయితే ముందుగా ఆమె జంతర్ మంతర్ సినిమాల్లో నటించింది కానీ యమలీల చిత్రం ముందుగా విడుదలైంది. యమలీల భారీ హిట్ కావడంతో ఇంద్రజకి మంచి ఆఫర్స్ వచ్చాయి. ఇక దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సొగసు చూడతరమా సినిమాలో ఇంద్రజ నటన గాను మంచి పేరు వచ్చింది. దాదాపుగా తెలుగులో ముప్పై సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఇంద్రజ.. మలయాళంలో ఎక్కువ సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకి దూరంగా ఉన్న ఇంద్రజ మళ్ళీ శతమానం భవతి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఇంద్రజ.

ఇక ఇది ఇలా ఉంటే దీపావళి సందర్బంగా HMTV ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది ఇంద్రజ.. ముందుగా తనకి జర్నలిస్ట్ అవ్వాలని ఉండేదాని కానీ సినిమా అవకాశాలు వెంటవెంటనే రావడంతో అటు వైపు వెళ్లలేదని చెప్పుకొచ్చింది. ఇక ఇండస్ట్రీలో సొగసు చూడతరమా సినిమా తరవాత మంచి పాత్రల కోసం ఎదురుచూసనని కానీ దక్కలేదని అన్నారు. అయితే మలయాళం ఇండస్ట్రీలో ఆ ఫీల్ పోయిందని అన్నారు. అటు అమ్మదొంగ సినిమా తరవాత కమర్షియల్ సినిమాలు చేసేందుకు ఉపయోగపడిందని అన్నారు.

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మంచి మంచి పాత్రల కోసం ఎదురు చూస్తునట్ట్టుగా చెప్పుకొచ్చింది ఇంద్రజ. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ కి తన భర్తే కారణమని చెప్పుకొచ్చింది ఇంద్రజ. పాప పుట్టాక ఎదో డిప్రెషన్ లో ఉండగా తన భర్తే తానూ ఎదో మిస్ అవుతున్నట్టుగా గమనించి తనని మళ్ళీ సినిమాల వైపు వచ్చేలా చేశారని చెప్పుకొచ్చారు ఇంద్రజ. 

Tags:    

Similar News