Roshan Kanakala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రోషన్ కనకాల
Roshan Kanakala: సినీ నటులు రాజీవ్ కనకాల, సుమల తనయుడు, యువ కథనాయకుడు రోషన్ కనకాల సోమవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
Roshan Kanakala: సినీ నటులు రాజీవ్ కనకాల, సుమల తనయుడు, యువ కథనాయకుడు రోషన్ కనకాల సోమవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్న ఆయన, మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామివారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు రోషన్ కనకాలకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల అభిమానులు రోషన్‌తో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు.
దర్శనం తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రోషన్.. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన తదుపరి సినిమా గురించి ప్రస్తావిస్తూ, సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తానని ప్రకటించారు.