Live Updates: ఈరోజు (సెప్టెంబర్-30) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 30 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-30 01:15 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 30 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చతుర్దశి: రా.11-29 వరకు తదుపరి పౌర్ణిమ | పూర్వాభాద్ర నక్షత్రం రా.1-41వరకు తదుపరి ఉత్తరాభాద్ర | వర్జ్యం: ఉ.8-28 నుంచి 10-12 వరకు | అమృత ఘడియలు: సా.6-49నుంచి 7-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-32 నుంచి 12-31 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-50

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-09-30 15:40 GMT

-హేమంత్ హత్య కేసులో ముగిసిన నిందితుల తొలిరోజు కస్టడీ

-విచారణలో హత్యకు గల కారణాలను విషయాలను వెల్లడించిన నిందితులు

-అవంతి ప్రేమ విషయం తెలిసే కట్టడి చేశాం

-మా నుంచి తప్పించుకుని హేమంత్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.

-వివాహం చేసుకున్నట్లు మాకు పోలీసుల నుంచి సమాచారం వచ్చింది

-15 సంవత్సరాలుగా బావమ్మర్ధి యుగంధర్‌తో మాటలు లేవన్న లక్ష్మారెడ్డి

-హేమంత్, అవంతి విషయంపై తిరిగి మాట్లాడాల్సి వచ్చింది

-ప్రాణం కంటే పరువుకే ముఖ్యమని భావించే కుటుంబం మాది

-మేము ఉంటున్న కాలనీలో మా కుటుంబానిదే అధిపత్యం 

-అవంతి ప్రేమ విషయంతో కాలనీలో తలదించుకోవాల్సి వచ్చింది - లక్ష్మారెడ్డి

2020-09-30 13:42 GMT

గంగుల కమలాకర్ రాష్ట్ర మంత్రి@ తెలంగాణ భవన్..

* 2013 వరకు మొక్కుబడిగా 18వందల కోట్లు మాత్రమే బిసి వర్గాలకు బడ్జెట్ పెట్టారు.

* ఈ ఆరేళ్ళ లో 26వేల కోట్లు బడ్జెట్ కేసీఆర్ కేటాయించారు.

* కేసీఆర్ ప్రభుత్వం పాలనలో 261 గురుకులాలు బీసీలకు కేటాయించింది.

* 95వేల మంది బీసీ గురుకులాల ద్వారా బిసిలు చదువుకుంటున్నారు.

* బిసి కులాల కోసం హైదరాబాద్ లో బీసీ భవన్ కడుతున్నాము.

* కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎప్పుడైనా బిసిల కోసం ఆలోచన చేసిందా?

* టీడీపీ కంటే ఎక్కువగా టీడీపీ తరువాత కేసీఆర్ కి దగ్గరగా కేసీఆర్ కి ఉన్నారు.

2020-09-30 13:38 GMT

వినయ్ భాస్కర్ ప్రభుత్వ చిప్ విప్@తెలంగాణ భవన్

* తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అమలులో ఉన్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రజలకు అందిస్తున్నారా?

* గత ప్రభుత్వాల హయాంలో పనిలేక ఆత్మహత్యలకు పాల్పడే చేనేత కార్మికులు- వివిధ కులాలకు ఉపాధి టీఆరెస్ ప్రభుత్వం కల్పించేది వాస్తవం కాదా?

* హైదరాబాద్ టు ఆదిలాబాద్ వరకు మాస్త్యకార్మికుడు ఎంతో సంతోషంగా ఉన్నారు.

* కనీసం చదువుకోలేని పరిస్థితి నుంచి ఉన్నత చదువువుల కోసం విదేశాలు వెళ్లే పరిస్థితి కేసీఆర్ వల్ల వచ్చింది వాస్తవం కాదా?

* తెలంగాణ బిసిలు దేశంలోని బీజేపీ వైపు చూడటం కాదు...దేశంలోని అన్ని రాష్ట్రాల బిసిల కేసీఆర్ వైపు- టీఆరెస్ పథకాల పై వైపు చూస్తున్నారు.

* లాక్డౌన్ సమయంలో వలసకులీలను కేంద్రం పట్టించుకోకపోతే... కేసీఆర్ తెలంగాణలో ఉన్న వలసకులీలను సొంతరాష్ట్ర ప్రజల్లాగా చూసుకున్నారు.

* రైల్వే- ఎల్ఐసి ని ప్రైవేట్ పరం చేసిన ఘనత బీజేపీ.

2020-09-30 13:35 GMT

బొల్లా మల్లయ్య యాదవ్ ఎమ్మెల్యే@ తెలంగాణ భవన్..

* మతాలు-కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ.

* సెంటిమెంట్ రాజకీయాలు బీజేపీ చేస్తోంది.

* దేశ సరిహద్దులను పెట్టకుండా ఎందుకు బీజేపీ రాజకీయాలు చేస్తోంది.

* బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న వాదన కేసీఆర్ ది.

* రాజకీయ విమర్శలు లక్ష్మణ్ మానుకోవాలి--బీజేపీ బీసీలకు చేసింది ఏంటో చెప్పాలి?

వివేకానంద గౌడ్ ఎమ్మెల్యే@తెలంగాణ భవన్..

* బీజేపీకి కేసీఆర్--టీఆరెస్ పై విమర్శలు చేయడం అలవాటు అయింది.

* తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా బిసిలందరూ టీఆరెస్ కు బ్రమ్మరథం పడుతున్నారు.

* హైదరాబాద్ లో ఉండి మాట్లాడితే నాయకుడు కాదు..గ్రామాల్లో తిరిగితే నిజాలు తెలుస్తాయి.

* కేసీఆర్ పేరుకే అగ్రకులానికి చెందిన వ్యక్తి... బిసిలన్న బలహీన వర్గాలు అన్నా ప్రాణం.

2020-09-30 13:31 GMT

కొమరం భీమ్ జిల్లా..

-ఈనెల ముప్పై నుండి వచ్చేనెల. అక్టోబరు 31 వరకు అమలు..

-బహిరంగ సభలు, సమావేశాల పై నిషేదం

-ఉత్తర్వులు జారీ చేసిన ఇంచార్జ్ ఎస్పీ సత్యనారాయణ

2020-09-30 13:26 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

-15 గేట్లు ఎత్తిన అధికారులు

-పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 117.550 మీటర్లు

-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

-ప్రస్తుత సామర్థ్యం 7.68 టీఎంసీ

-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 40,000 క్యూసెక్కులు

2020-09-30 09:58 GMT

- హైదరాబాద్ దారుస్సలాం ఎంఐఎం పార్టీ కార్యాలయం..

- హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ మీడియా సమావేశం..

- బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సిబిఐ కోర్టు తీర్పు తమకు బాధ కలిగించింది.. కె 

- బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులందరిపై అభియోగాలు కొట్టివేయడం ఈ రోజు ఆ తీర్పు వెలువరించడం చీకటి రోజులుగా భావిస్తున్నాం..

- బాబ్రీ మసీదు కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా తేల్చిన లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు ఎలా తీర్పు ఇచ్చింది అర్దం కానీ విషయం..

- సరైన ఆధారాలు లేవని అందరిపై అభియోగాలు కొట్టివేయడం ఎంత వరకు సరైన నిర్ణయం.

- నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనేందుకు ఆధారాలు లేవన్న కోర్టు మరి బాబ్రీ మసీదు ఎవరు కూల్చేశారు తేల్చాలి..

- బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 28 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది ఈ ఘటనలో ఎంతో మంది గాయాలు అయ్యాయి. ప్రాణాల మీదకు తెచ్చుకున్నరు.

- ఉమ భారతి, అద్వానీ బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు అనంతరం వీరు అందరూ కలిసి స్వీట్లు పంచుకుని పండుగ చేసుకుంటున్నారు.

- సీబీఐ ఛార్జ్ లో అనేక విషయాలు దాచి పెట్టింది.

- కేంద్రంలో అద్వానీ కళ్యాణ్ సింగ్ తో ఎందుకు రాజీనామా చేయించలేదు..

- బాబ్రీ మజీద్ పై సిబిఐ కోర్టు తీర్పు ఓ వర్గం వారికి అనుకూలంగా ఉంది..

- సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది బాబ్రీ మసీదును మేము సంరక్షించడంలో..

- బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ ఓ ముద్దాయి గ వున్నాడు కానీ కేంద్రం ఇతనికి సివిలైజేషన్ అవార్డు ఇచ్చింది..

2020-09-30 09:10 GMT

అవంతిక తండ్రి లక్ష్మ రెడ్డి,యుగేందర్ రెడ్డి లను కస్టడీలోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు

చర్లపల్లి జైలు నుంచి ప్రైవేట్ వాహనం లో ఇద్దరు నిందితులను లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన గచ్చిబౌలి పోలీసులు.

2020-09-30 08:11 GMT

- హేమంత్ కుటుంబ సభ్యలతో పాటు తనకి ప్రాణ హాని ఉందని సిపి తెలిపిన అవంతి.

- నిందితులను కఠినంగా శిక్షించాలని కోరిన కుటుంబ సభ్యులు.

2020-09-30 08:08 GMT

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ

టీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న వలసలు..

బీజేపీ నుంచి మరో కార్పొరేటర్ జంప్

అర్బన్ ఎం.ఎల్.ఏ. సమక్షం లో టిఆర్ ఎస్ లో చేరిన 27 వ డివిజన్ కార్పొరేటర్ నారాయణ

Tags:    

Similar News