Live Updates: ఈరోజు (ఆగస్ట్-27) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-27 01:02 GMT
Live Updates - Page 4
2020-08-27 06:04 GMT

Amaravati updates: ఏపీ కేంద్ర పోలీస్ కార్యాలయానికి 20లక్షల రూపాయల విలువైన అంబులెన్స్ ను ఎస్‌ బీ ఐ బహూకరణ..

అమరావతి....

-ఏపీ కేంద్ర పోలీస్ కార్యాలయానికి 20లక్షల రూపాయల విలువైన అంబులెన్స్ ను ఎస్‌ బీ ఐ బహూకరణ..

-ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు అంబులెన్స్ ను అందజేసిన ఎస్ బీ ఐ డీజీఎం రవిమోహన్ సక్సేనా..

2020-08-27 05:53 GMT

Amaravati updates: మంత్రి బొత్స ప్రెస్ రిలీజ్..

అమరావతి...

-మంత్రి బొత్స ప్రెస్ రిలీజ్..

-భూ సమీకరణలో భూములు ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు 158 కోట్లు

-2 నెలల పెన్షన్ మొత్తం 9.73 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించిన మంత్రి బొత్ససత్యనారాయణ.

-ఆ మొత్తాలు వారి బ్యాంక్ అకౌంట్ ల లో జమ అవుతాయి..

2020-08-27 05:47 GMT

Vijayawada updates: ప్రకాశం బ్యారేజి పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య

విజయవాడ....

-ప్రకాశం బ్యారేజి పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య

-మంగళగిరికి చెందిన షేక్ ఉమర్ గా గుర్తించిన తాడేపల్లి పోలీసులు

-ఉమర్ ను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నం చేసిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

-కుటుంబ కలహాల నేపద్యంలో బలవన్మరణానికి పాల్పడిన ఉమర్

2020-08-27 05:43 GMT

Kurnool-Srisailam updates: శ్రీశైలం మహా కుంభకోణంపై మరోసారి విచారణను వేగవంతం చేసిన ఏసీబీ అధికారుల బృందం

-కర్నూలు జిల్లా

-శ్రీశైలం మహా కుంభకోణంపై మరోసారి విచారణను వేగవంతం చేసిన ఏసీబీ అధికారుల బృందం

-కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో నెల రోజుల జాప్యం అనంతరం ప్రస్తుతం పరిస్థితులు కుదుట పడడంతో మళ్లీ మూడోసారి విచారిస్తున్న ఏసిబీ బృందం

-శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అతిథి గృహం వద్ద దేవస్థానంకి సంబంధించిన అన్ని రికార్డులను తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులు

-ఇదివరకు 2017 నుండి ఇప్పటివరకు ఆన్లైన్ టికెట్ల రికార్డులను మాత్రమే తనిఖీ చేయగా ప్రస్తుతం తాజాగా 2016–17 సంవత్సరానికి సంబంధించి మ్యాన్యువల్ టికెట్ల రికార్డులను పరిశీలించి అవినీతి జరిగితే వారిని అరెస్టు చేసే అవకాశం

-ఈ కుంభకోణంలో ఇప్పటికే 33 మంది అరెస్టు చేసిన అధికారులు

-ఈ కుంభకోనానికి సంబంధించి ఇప్పటికే IPC 406,420,409 మరియు ఐ టి యాక్ట్ 65,66 సెక్షన్లు క్రింద కేసు నమోదు

-కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే అందరికీ బెయిలు మంజూరు చేసిన కోర్టు

-విచారణలో భాగంగా వివిధ విభాగాలకు సంబంధించి వేరువేరుగా పిలిపించి గోప్యంగా విచారిస్తున్న అధికారులు

-కుంభకోణంలో అరెస్టయిన 33 మందిని మరోసారి విచారణ చేయనున్నట్లు సమాచారం

-శ్రీశైలం కుంభకోణంలో 2 కోట్ల 56 లక్షల కుంభకోణం జరిగినట్టు ఇప్పటికే నిర్ధారించిన ఏసిపి బృందం వాటిని రికవరీ చేసే దిశగా రెవెన్యూ చట్టాన్ని అమలు చేసి రికవరీ చేసే దిశగా కూడా ప్రయత్నాలు ముమ్మరం

2020-08-27 05:12 GMT

Guntur updates: చేబ్రోల్ లోని చతుర్ముక బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం...

గుంటూరు....

-చేబ్రోల్ లోని చతుర్ముక బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం...

-ఎమ్మెల్యెలు వైసిపి కిలారిరోశయ్య, ముస్తాఫా...

-ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు.....

2020-08-27 05:05 GMT

Tirumala updates: ఎస్వీబీసీ ఛానల్ కు రూ 10 లక్షలు విరాళం..

తిరుమల :

-ఎస్వీబీసీ ఛానల్ కు రూ 10 లక్షలు విరాళం..

-రూ 10 లక్షల విరాళంను అందించిన విజయవాడకు చెందిన భక్తుడు వెంకట సుబ్బారావు..

-టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డికి నాదనీరాజనం వేదికపై విరాళం చెక్ ను అందజేసిన భక్తుడు..

2020-08-27 04:57 GMT

East Godavari corona updates: తూర్పును కరోనా కుదిపేస్తోంది

తూర్పుగోదావరి

-తూర్పును కరోనా కుదిపేస్తోంది

-జిల్లాలో 53వేల ,567కు చేరుకున్న

-కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

-ఇందులో యాక్టివ్‌ కేసులు 17వేల649 .

-ఇప్పటివరకూ 35వేల564 మంది కోలుకున్నారు.

-354కు చేరిన కరోనా మృతుల సంఖ్య

-కేసుల తీవ్రతలో కాకినాడ, రాజమండ్రి- లలోనే అధికంగా వున్నాయి.

2020-08-27 04:53 GMT

Tirupati updates: ఏర్పేడు సమీపంలో రోడ్డు ప్రమాదం

తిరుపతి..

-ఏర్పేడు సమీపంలో రోడ్డు ప్రమాదం

-పోలీసు వాహనాన్ని ఢీకొన్న లారీ

-ముగ్గురు పోలీసులకు గాయాలు‌

-ఒకరి పరిస్థితి విషమం..

2020-08-27 04:49 GMT

East Godavari weather updates: -రాజమండ్రి- ఏజన్సీ, కోనసీమ ప్రాంతాలతో సహా పలు ప్రాంతాలలో ఎడతెరిపిలేకుండా వర్షాలు

తూర్పుగోదావరి

-రాజమండ్రి- ఏజన్సీ, కోనసీమ ప్రాంతాలతో సహా పలు ప్రాంతాలలో ఎడతెరిపిలేకుండా వర్షాలు

2020-08-27 03:42 GMT

Nellore district updates: మండల కేంద్రము వరికుంటపాడులో నెంబరు 565 హై వే పై సెబ్ అధికారుల తనిఖీలు.

-నెల్లూరు స్క్రోలింగ్:--

-మండల కేంద్రము వరికుంటపాడులో నెంబరు 565 హై వే పై సెబ్ అధికారుల తనిఖీలు. బెంగుళూరు నుంచి అక్రమంగా తరలిస్తున్న 39 మధ్యం బాటిళ్లు పట్టుకొన్న పోలీసులు, ఎక్సైజ్ అధికారులు

-మద్యం లోడుతో వెళ్తున్న మినీ వ్యాను, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు

-బెంగళూరు నుంచి నరసరావుపేటకు ద్రాక్ష లోడ్ మాటున తీసుకెళ్తున్న అక్రమార్కులు

Tags:    

Similar News