Kurnool-Srisailam updates: శ్రీశైలం మహా కుంభకోణంపై మరోసారి విచారణను వేగవంతం చేసిన ఏసీబీ అధికారుల బృందం

-కర్నూలు జిల్లా

-శ్రీశైలం మహా కుంభకోణంపై మరోసారి విచారణను వేగవంతం చేసిన ఏసీబీ అధికారుల బృందం

-కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో నెల రోజుల జాప్యం అనంతరం ప్రస్తుతం పరిస్థితులు కుదుట పడడంతో మళ్లీ మూడోసారి విచారిస్తున్న ఏసిబీ బృందం

-శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అతిథి గృహం వద్ద దేవస్థానంకి సంబంధించిన అన్ని రికార్డులను తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులు

-ఇదివరకు 2017 నుండి ఇప్పటివరకు ఆన్లైన్ టికెట్ల రికార్డులను మాత్రమే తనిఖీ చేయగా ప్రస్తుతం తాజాగా 2016–17 సంవత్సరానికి సంబంధించి మ్యాన్యువల్ టికెట్ల రికార్డులను పరిశీలించి అవినీతి జరిగితే వారిని అరెస్టు చేసే అవకాశం

-ఈ కుంభకోణంలో ఇప్పటికే 33 మంది అరెస్టు చేసిన అధికారులు

-ఈ కుంభకోనానికి సంబంధించి ఇప్పటికే IPC 406,420,409 మరియు ఐ టి యాక్ట్ 65,66 సెక్షన్లు క్రింద కేసు నమోదు

-కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే అందరికీ బెయిలు మంజూరు చేసిన కోర్టు

-విచారణలో భాగంగా వివిధ విభాగాలకు సంబంధించి వేరువేరుగా పిలిపించి గోప్యంగా విచారిస్తున్న అధికారులు

-కుంభకోణంలో అరెస్టయిన 33 మందిని మరోసారి విచారణ చేయనున్నట్లు సమాచారం

-శ్రీశైలం కుంభకోణంలో 2 కోట్ల 56 లక్షల కుంభకోణం జరిగినట్టు ఇప్పటికే నిర్ధారించిన ఏసిపి బృందం వాటిని రికవరీ చేసే దిశగా రెవెన్యూ చట్టాన్ని అమలు చేసి రికవరీ చేసే దిశగా కూడా ప్రయత్నాలు ముమ్మరం

Update: 2020-08-27 05:43 GMT

Linked news