Live Updates: ఈరోజు (సెప్టెంబర్-14) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-14 01:37 GMT
Live Updates - Page 2
2020-09-14 09:56 GMT

Telangana updates: టీఆరెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు..జగ్గారెడ్డి..

గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి..

-క్వశ్చన్ అవర్ లో ప్రతిపక్షానికి మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదు

-జీరో అవర్ లో కాంగ్రెస్ నుండి ఒకరికి మాట్లాడటానికే అవకాశం ఇస్తున్నారు

-ఆటో రిక్షాలు, టూ వీలర్లకు ట్రాఫిక్ చలానాలు అధికంగా విధిస్తున్నారు

-సీఎం ఆదేశాలను అనుసరిస్తూ ట్రాఫిక్ పోలీస్ అధికారులు భారీ జరిమానాలు వేయిస్తున్నారు

-ట్రాఫిక్ నిబంధనలు కొద్దిగా అతిక్రమించినా ఎక్కువ ఫైన్ లు వేస్తున్నారు

-ట్రాఫిక్ పోలీసులకు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది

-రాష్ట్రం మొత్తం చలనాలతో ఇబ్బందులు పడుతున్నారు

-చలానా కట్టకపోతే పెనాల్టీలు వేస్తున్నారు

-ఆటో తోలుకునే వారికి వారు సంపాదించే సగం డబ్బు చలనాలకే సరిపోతుంది

-కరోనా కష్ట కాలంలో ఈ ఫైన్ లు వేసి ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం అవసరమా

-కేసీఆర్ తక్షణమే ఈ ఫైన్ వేసే విధానాన్ని నిలిపివేయాలి

-ఈ అంశం అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదు

-రైతుబంధు పేరుతో ఇచ్చిన డబ్బును ఆ రైతు కొడుకు నుండి వసూలు చేస్తున్నారు

2020-09-14 09:37 GMT

Medak ACB updates: మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఏసీబీ కేసు విచారణ వేగం పెంచిన ఏసీబీ

మెదక్.. ఏసీబీ ....

-ఐదుగురు నిందితుల కస్టడి కోరుతూ పిటీషన్

-బ్యాంక్ లాకర్ కీ, ఇంటి బీరువా కీ కోసం గాలింపు

-బీరువా, లాకర్ లో కీలక సమాచారం, ఆస్తుల వివరాలు తెలిసే అవకాశం

-ఆర్డీవో అరుణా రెడ్డి ఇచ్చిన సమాచారం తో విచారణ స్పీడ్అప్

-కలెక్ట్ ఆఫీస్ లోని మరికొందరు సిబ్బంది పాత్రపై ఆధారాలు సేకరణ

-మెదక్ చెందిన మరో రియల్టర్ పాత్రపై ఆధారాలు

-మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి పాత్రపై ఆధారాల కోసం సాగుతున్న విచారణ

2020-09-14 09:24 GMT

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ లో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు పై చర్చ..

అసెంబ్లీ.. 

-చర్చ సందర్భంగా కాంగ్రెస్-టీఆరెస్ సభ్యుల మధ్య వాగ్వాదం.

-కేబినెట్ లో ఉన్న వ్యక్తులకు యూనివర్సిటీ ఎలా ఇస్తారు?-- శ్రీధర్ బాబు కాంగ్రెస్ ఎమ్మెల్యే

-ఐదు కొత్త యూనివర్సిటీ లలో మూడు టీఆరెస్ ఎమ్మెల్యే లవే- శ్రీధర్ బాబు ఎమ్మెల్యే కాంగ్రెస్

-ప్రభుత్వ యూనివర్సిటీ లకు నిధులు- పోస్టుల భర్తీ చేయాలి.

-ప్రభుత్వ యూనివర్సిటీ లలో పోస్టుల భర్తీ చేయకుండా స్టెన్తేన్ ఎలా అవుతాయి?- శ్రీధర్ బాబు

-శ్రీధర్ బాబు ప్రసంగాన్ని అడ్డుకున్న అసెంబ్లీ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

-సభలో పార్టీలు-వ్యక్తుల పేర్ల ఎలా ప్రస్తావిస్తారని ప్రశ్న.

-శ్రీధర్ బాబు ప్రస్తావించిన పేర్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్.

-అసెంబ్లీలో యూనివర్సిటీల పై ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ పెట్టాలి.

-UGC నిబంధనల ప్రకారమే యూనివర్సిటీల అనుమతి ఇచ్చారు! మంత్రి వేముల .

2020-09-14 09:06 GMT

Jurala Project: జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద...

మహబూబ్ నగర్ జిల్లా :

-10 గేట్లు ఎత్తివేత..

-ఇన్ ఫ్లో: 1,06,800 వేల క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో: 1,08,924 వేల క్యూసెక్కులు.

-పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం:

-9.657 టీఎంసీ.

-ప్రస్తుత నీట్టి నిల్వ: : 9.542 టీఎంసీ.

-పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.

-ప్రస్తుత నీటి మట్టం: 318.460 మీ.

2020-09-14 08:22 GMT

TS Assembly: అసెంబ్లీ లో కరోనా కలకలం..

అసెంబ్లీ..

-14 మంది పోలీస్ కానిస్టేబుల్స్, హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యేకు కరోన రావడంతో వీలైనంత త్వరగా అసెంబ్లీ ని సెషన్ ను ముగించే యోచనలలో     ప్రభుత్వం...?

-రేపు ఎలక్ట్రిసిటీ, ఎల్లుండి వ్యవసాయం పై స్వల్ప కాలిక చర్చ

2020-09-14 07:44 GMT

Sravani Case updates: సీరియల్ నటి శ్రావణి కేసులో విచారణ ముగిసింది..ఏఆర్ శ్రీనివాస్..

ఏఆర్ శ్రీనివాస్, డీసీపీ, వెస్ట్ జోన్:-

-మధ్యాహ్నం మీడియా ముందుకు నిందితులు ను ప్రవేశ పెడుతాం

-ఈ కేసుల్లో తల్లిదండ్రులు , సాయి వేదించినట్లు ఆధారాలు ఉన్నాయి

-ఈ కేసులో ఇద్దరి ప్రమేయం పై ఆడియో కాల్స్, వీడియో లు ఉన్నాయి

-ఈరోజు నిందితులను రిమాండ్ చేస్తాము

-శ్రావణి ఆత్మహత్య కేసులో ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు

-వాటికి సంబంధించి టెక్నీకల్ ఏవిడెన్స్ సేకరించాము

2020-09-14 07:40 GMT

TS Assembly: అసెంబ్లీ..గన్ పార్క్ వద్ద అలజడి..

అసెంబ్లీ..

-ప్లకార్డులతో నిరసనలు తెలిపిన సామాజిక కార్యకర్తలు, ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థులు..

-దుబ్బాక, ధర్మపురి నియోజకవర్గాల అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ జరపాలంటూ ప్లకార్డుల ప్రదర్శన..

-భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు..

-అరెస్ట్ చేసి తరలించిన పోలీసులు..

2020-09-14 07:32 GMT

Telangana updates: సీపీఐ రాష్ట్ర కార్యాలయం పై దాడి జరిగిన ఆగంతకుల గుర్తింపు..

-నిన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి వాహనం తో పాటు మరో వాహనంపై దాడి..

-దాడిని అడ్డుకోబోయిన రెడ్ గార్డ్ సురేందర్ పై కూడా దాడికి యత్నం...

-పాత బస్తి ఛత్రినాక కు చెందిన ఇద్దరు యువకులుగా గుర్తింపు...

-ఆ ఇద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసిన నారాయణ గూడ పోలీసులు..

-సీసీ టివి పుటేజిల ఆధారంగా గుర్తించినట్లు వెల్లడి...

-కార్యాలయం పై జరిగిన దాడికి కారణాల పై విచారిస్తున్న పోలీసులు

2020-09-14 07:07 GMT

Telangana Latest news: మేము కొత్త రోడ్లకు ఆలోచన చేస్తుంటే ...కేంద్రం ఉన్న రోడ్లను ముస్తుంది..కేటీఆర్..

తెలంగాణ శాసన మండలిలో మంత్రి కేటీఆర్..

# కంటోన్మెంట్ లో రోడ్ల మూసివేతపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు 10 లేఖలు రాసిన ఉలుకు పలుకు లేదు

# కేంద్రం కు రాష్ట్ర వినతులు అరణ్య రోధనగా ఉంది

# లాక్ డౌన్ లో రాష్ట్రం పనిచేయాలని అనుకుంటే ...కేంద్రం వల్ల పనులు ఆగిపోయాయి.

# విభజన రాజకీయాలు

కాకుండా ...రాష్ట్రాము కోసం

బిజెపి ప్రజా ప్రతినిధులు ఏమైనా పనిచేస్తే మంచిగా ఉంటది

# నాలుగు ప్రణాళికలతో హైదరాబాద్ నగరంలో రోడ్లను

అభివృద్ధి చేస్తునం

# మిస్సింగ్, లింక్ రోడ్లను గుర్తించి అభివృద్ధి చేస్తునం

2020-09-14 05:35 GMT

Sravani case updates: శ్రావణి కేసు కు సంబంధించిన ఇద్దరు అరెస్టు..

హైదరాబాద్..

ఎస్ ఆర్ నగర్ పి ఎస్..

-శ్రావణి సూసైడ్ కు కారణం అయిన ఇద్దరు అరెస్టు.. సినీ నిర్మాత అశోక్ రెడ్డి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్న పోలీసులు..

1) సాయి కృష్ణ రెడీ

2) దేవ రాజ్ రెడ్డి లని ఈ రోజు రిమాండ్ తరలించనున్న పోలీసులు

శ్రావణి తల్లి తండ్రి నుండి వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు..

👉 నేడు సాయి రెడ్డి దేవరాజు లని ఇద్దరినీ రిమాండ్ తరలించనున్న పోలీసులు..

శ్రావణి సూసైడ్ కేసులో ఎస్ అర్ నగర్ పోలీసుల ఎదుట హాజరు కావాలని సిని నిర్మాత అశోక్ రెడ్డి కి నోటీసులు జారీ చేసిన పోలీసులు..

శ్రావణి సూసైడ్ కేసులో నిర్మాత అశోక్ రెడ్డి పై నమోదైన ఎఫ్ఐఆర్..

అశోక్ రెడ్డి నుండి స్టేట్ మెంట్ రికార్డు చేసి అనంతరం అరెస్ట్ చేయనున్న పోలీసులు.

నిందితులు దేవరాజు, సాయి కృష్ణ రెడ్డి ని 8 గంటలు పాటు విచారణ చేసిన పోలీసులు

ఇద్దరి స్టేట్మెంట్ లు రికార్డ్ చేసిన ఎస్ఆర్ నగర్ పోలుసులు

శ్రావణి ఆత్మహత్య పై వారి తల్లిదండ్రులు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు

తన కూతురు ఆత్మహత్య కు దేవరాజే కారణం మని మరో సారి స్టేట్మెంట్ ఇచ్చిన శ్రావణి తల్లి

దేవరాజు ను కట్టినంగా శిక్షించాలని పోలీసులు ముందు కన్నీరు పెట్టుకున్న శ్రావణి తల్లి

ఇప్పటికే ఆడియో టేపులు, వీడియోలు, సీసీ టీవీ ఫుటేజ్ లు పరిశీలించి విచారణ చేసిన ఎస్ ఆర్ నగర్ పోలీసులు

Tags:    

Similar News