Live Updates: ఈరోజు (09 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 09 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-11-09 02:51 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 09 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | నవమి రా.12-18 తదుపరి దశమి | మఖ నక్షత్రం తె.4-05 తదుపరి పుబ్బ | వర్జ్యం సా.4-18 నుంచి 5-52 వరకు | అమృత ఘడియలు రా.1-43 నుంచి 3-18 వరకు | దుర్ముహూర్తంమ.12-06 నుంచి 12-51 వరకు తిరిగి మ.2-22 నుంచి 3-07 వరకు | రాహుకాలం ఉ.7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-05 | సూర్యాస్తమయం: సా.05-23

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-11-09 05:25 GMT

సంగారెడ్డి జిల్లా ...

-జిన్నారం మండలంలోని గడ్డపోతారం, కిస్టాయ పల్లి రహదారిపై వెళ్తున్న బైకు, కారు ఢీ కొనడంతో మంటలు చెలరేగి రెండు వాహనాలు పూర్తిగా దగ్ధం.

-మంటలను ఆర్పిన ఫైర్ సిబ్బంది.

-ఇరువురి కి స్వల్ప గాయాలు

2020-11-09 05:23 GMT

జాతీయం..

-గడిచిన 24 గంటల్లో 8,35,401 టెస్టులు నిర్వహణ

-దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11,85,72,192 టెస్టులు నిర్వహణ

-దేశవ్యాప్తంగా 2074 లాబ్స్ లో జరుగుతున్న కరోనా నిర్ధారణ పరీక్షలు

-కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉన్న 1141 ప్రభుత్వ లాబ్స్,933 ప్రైవేట్ లాబ్స్ - ఐసీఎంఆర్

2020-11-09 05:14 GMT

నిజామాబాద్..

-జమ్మూకాశ్మీర్ లో ఉగ్ర దాడిలో ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మహేష్ కుటుంబానికి సంతాపం తెలిపిన ఎమ్మెల్సీ కవిత..

-వీర జవాన్ కు నివాళ్ళు అంటూ ట్విట్ చేసిన కవిత

2020-11-09 05:11 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

-6 గేట్లు ఎత్తిన అధికారులు

-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 98,20 మీటర్లు

-ఇన్ ఫ్లో 8,600 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో 5,500 క్యూసెక్కులు

2020-11-09 05:07 GMT

నిజామాబాద్

-జమ్ముకశ్మీర్ లో టెర్రరిస్టులతో జరిగిన పోరులో వీరమరణం పొందిన ర్యాడా మహేష్ కు నివాళి తెలిపిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి

-దేశ రక్షణ కోసం సైన్యం లో చేరి భారతావని కోసం నీవు చేసిన త్యాగం మరువలేనిది.

-వీర సైనికుడు మహేష్ కు యావత్తు తెలంగాణ నివాళి అర్పిస్తుంది.

-మహేష్ తో పాటు వీరమరణం పొందిన తోటి సైనికులకు నా జోహార్లు

-వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

-వీర జవాన్ల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న-స్పీకర్ పోచారం

2020-11-09 05:04 GMT

హైదరాబాద్..

-ఉదయం 10.30 జూబ్లీహిల్స్ లెదర్ పార్క్ ప్రారంభం

-11 గంటల కు రోడ్ నెంబర్ 45 నుంచి ఓల్డ్ ముంబై హావే కు లింక్ రోడ్

-11.30 గంటలకు ఖాజాగుడా గచ్చిబౌలి లింక్ రోడ్

-12 గంటలకు మియాపూర్ నిజాంపేట్ లింక్ రోడ్ ల ప్రారంభం

-నగరంలో వరద సహాయం అందని భాదితులు భాదితులు ఆందోళనలు చేసే అవకాశం ఉందని భారీగా పోలీస్ బందోబస్తు

2020-11-09 03:59 GMT

నిజామాబాద్:

-జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన మహేష్ కు ఘన నివాళి ప్రకటించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి.

-మహేష్ త్యాగం మరువలేనిది. దేశం కోసం ప్రాణాలు అర్పించడం స్ఫూర్తి దాయకం.

-వీర సైనికునికి యావత్ తెలంగాణ నివాళులు అర్పిస్తుంది.

-మహేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది.

-మహేష్ తో పాటు వీర మరణం పొందిన సైనికులకు జోహార్లు : మంత్రి ప్రశాంత్ రెడ్డి.

2020-11-09 03:14 GMT

ఆదిలాబాద్ జిల్లా.. 

-కుమ్రంబీమ్ జిల్లా గిన్నేదరిలో అత్యల్పంగా 9.5డిగ్రీలు నమోదు

-ఆదిలాబాద్ జిల్లా అర్లి టి 9.7 డిగ్రీలు

-బేలలో 10.డిగ్రీలు నమోదు

-తాంసిలో 10.1 డిగ్రీలు నమోదు

-చలి వణుకుతున్నా ప్రజలు

-చలి నుండి రక్షించుకోవడానికి చలిమంటలు కాచుకుంటున్నా ప్రజలు

Tags:    

Similar News