WHO On Woman Health: జర జాగ్రత్త మహిళలూ.. అధిక బరువుతో రొమ్ము క్యాన్సర్.. WHO హెచ్చరిక..!

WHO On Woman Health: చాలామంది మహిళలకు రుతుక్రమం ఆగిపోతే బరువు బాగా పెరిగిపోతుంటారు. శారీరక, మానసిక శ్రమ పడినా కూడా బరువు పెరిగిపోతూ ఉంటారు. అయితే ఇలా అధిక బరువుతో ఉన్న మహిళలకు రొమ్ముక్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందని తాజాగా WHO(ప్రపంచ ఆరోగ్యం సంస్థ) వెల్లడిస్తుంది.

Update: 2025-07-25 11:35 GMT

హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న మహిళలు, రుతుక్రమ ఆగిపోయిన తర్వాత అధిక బరువుతో బాధపడుతున్న మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని WHO వెల్లడించింది. ఈ సమస్యలతో ఉన్నవారిలో దాదాపు 31 శాతం మందికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది.

బరువు ఎక్కువ ఉన్నవారిలో అదేవిధంగా శారీరక శ్రమ పడనివారిలో ఈ మధ్యకాలంలో క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి. అంచనా ప్రకారం, ప్రతి లక్ష మంది మహిళల్లో సాధారణంగా వచ్చే సంఖ్యతో పోల్చితే అదనంగా 153 రొమ్ము క్యాన్సర్లు వస్తున్నాయని WHO చెబుతుంది. అంతేకాదు గుండె జబ్బులో ఉన్నవారిలో 32 శాతం రొమ్ము క్యాన్సర్లు పెరుగుతుంటే, గుండె జబ్బులు లేనివారిలో ఈ ప్రమాదం 13 శాతం వరకు ఉంది. అదేవిధంగా బరువు ఎక్కువగా ఉండటం, టైప్ 2 షుగర్ ఉన్నా లేకపోయినా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఒకే రకంగా ఉండటం ఇప్పుడు అందరినీ కలవర పెడుతోంది.

ఏదిఏమైనా రొమ్ముక్యాన్సరే కాకుండా ఏ ఇతర ప్రమాదకర ఆరోగ్య సమస్యలు తలెత్తు కుండా ఉండాలంటే బరువును తగ్గించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే బరువు తగ్గాలంటే తిండిని కంట్రోల్ చేయడం అని చాలామంది అనుకుంటారు. అయితే శరీరానికి సరైన పోషకాలున్న ఆహారం ఇవ్వకపోతే లేనిపోని వ్యాధులకు గురయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే సరైన ఆహారం తీసుకుంటూనే, వ్యాయామం చేయాలని డాక్టర్లు చెబుతున్నారు.

Tags:    

Similar News