Liver Infection: ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌.. అది లివర్‌ ఇన్‌ఫెక్షన్‌ కావొచ్చు..!

Liver Infection: శరీరంలో కాలేయం అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి.

Update: 2022-06-25 11:30 GMT

Liver Infection: ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌.. అది లివర్‌ ఇన్‌ఫెక్షన్‌ కావొచ్చు..!

Liver Infection: శరీరంలో కాలేయం అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇది టాక్సిన్స్‌ని బయటకు పంపడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, ప్రొటీన్లను సమతుల్యం చేయడం, గ్లూకోజ్‌ను శక్తిగా మార్చడం కాలేయం పని. అయితే చెడు అలవాట్ల వల్ల కాలేయానికి సంబంధించిన అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో మీరు నిర్లక్ష్యం చేస్తే లివర్‌ ఫెయిల్యూర్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాలేయం ఇన్‌ఫెక్షన్‌ లక్షణాల గురించి తెలుసుకుందాం.

పొత్తికడుపులో వాపు, నొప్పి

లివర్ ఇన్‌ఫెక్షన్ ప్రారంభంలో మీకు పొత్తికడుపులో నిరంతరం నొప్పి, వాపు ఉంటుంది. కాలేయానికి సంబంధించిన అన్ని సమస్యలలో మీకు ఈ సమస్య ఎదురవుతుంది. అందుకే ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు.

కామెర్లు సమస్య

కామెర్లు కాలేయానికి సంబంధించిన తీవ్రమైన సమస్య. శరీరంలో బిలిరుబిన్ అనే రసాయనం అధికంగా ఉంటే కామెర్లు సమస్య ఏర్పడుతుంది. లివర్ ఇన్‌ఫెక్షన్ ఉంటే మళ్లీ మళ్లీ కామెర్ల సమస్య రావచ్చు.

చర్మంపై దురద, దద్దుర్లు

లివర్ ఇన్ఫెక్షన్ సమస్యలో చర్మంపై దురద, దద్దుర్లు సాధారణం. ఈ సమస్య పదే పదే ఉంటే మీరు దానిని అస్సలు విస్మరించకూడదు.

ఆకలి నష్టం

ఆకలిని కోల్పోవడం అనేది కాలేయం ఇన్ఫెక్షన్ లక్షణంగా చెప్పొచ్చు. శరీరంలోకి వెళ్లిన ఆహారం సక్రమంగా జీర్ణం కావడానికి కాలేయం పనిచేయాలి. లివర్ ఇన్ఫెక్షన్ కారణంగా మీకు ఆకలి తగ్గుతుంది. తినాలని అనిపించదు.

Tags:    

Similar News