Heart Weak: ఈ లక్షణాలు కనిపిస్తే గుండె బలహీనంగా ఉన్నట్లే..!

Heart Weak: గుండె మన శరీరంలో నిరంతరం పనిచేసే ఒక ముఖ్యమైన భాగం.

Update: 2022-06-17 11:00 GMT

Heart Weak: ఈ లక్షణాలు కనిపిస్తే గుండె బలహీనంగా ఉన్నట్లే..!

Heart Weak: గుండె మన శరీరంలో నిరంతరం పనిచేసే ఒక ముఖ్యమైన భాగం. నేటి కాలంలో గుండె సంబంధిత సమస్యల కారణంగా మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అదే సమయంలో 35 నుంచి 40 సంవత్సరాల వయస్సులో ప్రజలు ఎక్కువగా గుండెపోటుకి గురవుతున్నారు. ఈ సమస్యలన్నింటికీ కారణం మన ఆహారం, జీవనశైలి. గుండె బలహీనంగా ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.

ఛాతీలో బర్నింగ్

గుండె బలహీనంగా ఉన్నప్పుడు శరీరంలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. అందులో మొదటిది వికారం. దీంతో పాటు ఛాతీలో మంటగా ఉంటుంది. మీరు చాలా రోజులుగా ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

అధిక రక్తపోటు

గుండె బలహీనతగా ఉన్నప్పుడు రక్తపోటు అదుపులో ఉండదు. దీనివల్ల గుండెపోటు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో తరచూ మీ రక్తపోటును తనిఖీ చేస్తూ ఉండాలి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాస సంబంధిత సమస్యలు గుండె బలహీనతకు కారణమవుతాయి. గుండె బలహీనంగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.

నిరంతర జలుబు

నిరంతర జలుబు సమస్య కూడా గుండె జబ్బు లక్షణంగా చెప్పవచ్చు. ఈ సమస్య మీ ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుంది. రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. అందుకే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

Tags:    

Similar News