Vitamin D: విటమిన్ డి లోపాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.. ఇలా చేస్తే ఆ లోపం మాయం

Vitamin D: విటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే, అలసట, నొప్పులు, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.

Update: 2025-08-05 08:30 GMT

Vitamin D: విటమిన్ డి లోపాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.. ఇలా చేస్తే ఆ లోపం మాయం

Vitamin D: విటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే, అలసట, నొప్పులు, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. ఈ లోపాన్ని భర్తీ చేయడానికి సరైన మార్గం, ప్రతిరోజూ కొంత సమయం పాటు ఎండలో ఉండటం. మనం ఎన్ని విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు తిన్నా, సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ డికి అవి సమానం కాదు.

ఈ రోజుల్లో చాలామంది ఆఫీసుల కోసం, ఇతర పనుల కోసం నాలుగు గోడల మధ్యే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీనివల్ల శరీరానికి సరైన సూర్యరశ్మి అందక విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ఈ లోపం వల్ల చాలా శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం, మన దేశంలో చాలామంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చెన్నైలో గర్భిణులపై చేసిన ఒక సర్వేలో 62 శాతం మందికి విటమిన్ డి లోపం ఉన్నట్లు తేలింది. ఎక్కువ సమయం ఆఫీసుల్లో గడపడం, శరీరమంతా కప్పి ఉంచే దుస్తులు ధరించడం దీనికి ప్రధాన కారణాలుగా గుర్తించారు.

మన చర్మంపై యూవీబీ కిరణాలు పడినప్పుడు శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కిరణాలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చాలా చురుకుగా ఉంటాయి. సాయంత్రం వేళల్లో యూవీఏ కిరణాలు మాత్రమే వస్తాయి, ఇవి విటమిన్ డి ఉత్పత్తికి అంతగా సహాయపడవు.

భారతదేశంలో ఉదయం 9 లేదా 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సూర్యరశ్మిలో ఉండటం విటమిన్ డి లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే, ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల చర్మ సమస్యలు కూడా రావచ్చు. బ్రిటన్ లాంటి దేశాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో ఉండాలని నిపుణులు చెబుతారు.

విటమిన్ డి పొందడానికి ప్రతిరోజూ 10 నుంచి 20 నిమిషాల పాటు ఎండలో ఉండాలి. మరొక అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ 30 నిమిషాలు ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి లోపం నుంచి బయటపడవచ్చు. ఉదయం పని ఒత్తిడి వల్ల ఎండలోకి వెళ్లడం కుదరకపోతే, కనీసం రోజుకు 5 నిమిషాలైనా ఎండలో ఉండటానికి ప్రయత్నించాలి. ఎండలోకి వెళ్లడం అస్సలు సాధ్యం కాకపోతే, గుడ్లు, చేపలు, పాలు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు.

Tags:    

Similar News