Women Health: మహిళలకి ఇవి అత్యవసరం.. లేదంటే ఆరోగ్యంపై ఎఫెక్ట్..!

Women Health: మంచి ఆరోగ్యానికి పోషకాలు అత్యవసరం.

Update: 2022-11-04 00:57 GMT

Women Health: మహిళలకి ఇవి అత్యవసరం.. లేదంటే ఆరోగ్యంపై ఎఫెక్ట్..!

Women Health: మంచి ఆరోగ్యానికి పోషకాలు అత్యవసరం. ముఖ్యంగా పురుషుల కంటే మహిళలకి ఎక్కువ పోషకాలు అవసరమవుతాయి. ఎందుకంటే పురుషుల కంటే మహిళలకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మహిళలు వారి వయస్సును బట్టి పోషకాలను తీసుకోవాలి. ఏ వయసువారు ఎలాంటి పోషకాలు తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

25 ఏళ్లలోపు బాలికలు

ఈ వయస్సులో అమ్మాయిలకు కాల్షియం అధికంగా అవసరం. తద్వారా ఎముకలు, కండరాలు సరిగ్గా అభివృద్ధి చెందుతాయి. వాటిని బలంగా చేస్తాయి. దీని కోసం మీరు పాల ఉత్పత్తులు, చేపలు, సోయాబీన్స్ తీసుకోవాలి. అలాగే విటమిన్ డి అవసరం. ఇది సూర్యుని ఉదయపు కిరణాల నుంచి లభిస్తుంది. మీరు సాల్మన్ చేపలు, ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.

మహిళల్లో ప్రతి నెలా పీరియడ్స్ వల్ల శరీరంలో ఐరన్ లోపించడం వల్ల బలహీనత ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో మాంసం, చేపలు, బచ్చలికూర, దానిమ్మ, బీట్రూట్ ఎక్కువగా తీసుకోవాలి. ఇక 25 నుంచి 40 ఏళ్ల మహిళలు DNA, RNA ఏర్పడటానికి ఫోలిక్ ఆమ్లం తీసుకోవాలి. గర్భధారణ సమయంలో శరీరానికి తగినంత ఫోలిక్ యాసిడ్ అవసరం. ఇది సిట్రస్ పండ్లు, కిడ్నీ బీన్స్, గుడ్లు, చిక్కుళ్ళలో లభిస్తుంది.

శరీర అభివృద్ధికి స్త్రీలలో పుష్కలంగా అయోడిన్ అవసరమవుతుంది. 25 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు కూడా ఐరన్‌ను ఎక్కువగా తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్లు B12, B16 అవసరం. ఇది ఆకుపచ్చ కూరగాయలు, పాలు, చేపలలో లభిస్తుంది.

Tags:    

Similar News