Turmeric: పసుపు ఒక దివ్య మూలిక.. చలికాలంలో వచ్చే ఈ సమస్యలకు మంచి ఔషధం..

Turmeric: సనాతన ఆయుర్వేదంలో మన ప్రాచీనులు పురాతన కాలం నుంచి పసుపుని విరివిగా వాడుతున్నారు.

Update: 2022-01-27 03:30 GMT

Turmeric: పసుపు ఒక దివ్య మూలిక.. చలికాలంలో వచ్చే ఈ సమస్యలకు మంచి ఔషధం..

Turmeric: సనాతన ఆయుర్వేదంలో మన ప్రాచీనులు పురాతన కాలం నుంచి పసుపుని విరివిగా వాడుతున్నారు. ఆయుర్వేద వైద్యులు పసుపుని ఔషధాల తయారీలో వాడేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పసుపుని అలాగే ఉపయోగిస్తున్నారు. ఇందులో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. చలికాలంలో పసుపు చాలా ఆరోగ్య సమస్యలని పరిష్కరిస్తుంది. పసుపు లేనిదే భారతీయ వంటకాలు అస్సలు తయారుకావు. పసుపు శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్గా పనిచేస్తుంది. చలికాలంలో పసుపును ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆసక్తికరమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

పసుపు సహజ పదార్ధం. ఇది సాధారణ జలుబు, కీళ్ల నొప్పులు, అజీర్ణం, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీరు పాలు, టీ వంటి పానీయాలలో చిటికెడు పసుపును కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపును ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరానికి లోపలి నుంచి మేలు చేస్తాయి. కాలేయ పనితీరును మెరుగుపరచడంలో పసుపు సహాయపడుతుంది. కాలేయ సంబంధిత సమస్యలను అధిగమించడానికి పసుపును క్రమం తప్పకుండా వాడాలి.

చలికాలంలో రోగాలు రాకుండా ఉండాలంటే కొవ్వు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. పసుపు ఆహారం రుచిని పెంచుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది చర్మం మెరిసేలా చేయడంలో పనిచేస్తంది. ఇది శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. పసుపు శతాబ్దాలుగా ఆయుర్వేదంలో భాగంగా ఉంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్ను బయటకు పంపడంలో సూపర్గా పనిచేస్తాయి.

చలికాలంలో తరచుగా జలుబు,దగ్గును ఎదుర్కోవలసి వస్తుంది. పసుపు పాలు సహజ ఔషధంలా పనిచేస్తాయి. గర్భిణీలు తరచుగా పసుపు పాలను తీసుకుంటారు. పసుపు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది గొంతు నొప్పిని తగ్గిస్తుంది. పసుపు శ్వాసకోశ మార్గాన్ని శుభ్రపరుస్తుంది, కర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా ఇది జలుబు దగ్గుతో పోరాడడంలో సహాయపడుతుంది. 

Tags:    

Similar News