Health Tips: ఈ పండు ఎక్కడ కనిపించినా వెంటనే తినేయండి.. లాభాలు అలాంటివి మరి
Health Tips: ఆరోగ్యం బాగుండాలంటే పండ్లు తినాలని నిపుణులు చెబుతుంటారు. అయితే కొన్ని రకాల పండ్ల గురించి అందరికీ తెలియదు.
Health Tips: ఈ పండు ఎక్కడ కనిపించినా వెంటనే తినేయండి.. లాభాలు అలాంటివి మరి
Health Tips: ఆరోగ్యం బాగుండాలంటే పండ్లు తినాలని నిపుణులు చెబుతుంటారు. అయితే కొన్ని రకాల పండ్ల గురించి అందరికీ తెలియదు. అలాంటి వాటిలో ఫొటోలో కనిపిస్తున్న రంబుటాన్ పండు ఒకటి. అరుదుగా కనిపించే ఈ పండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు.
రంబుటాన్ పండు అంటే ఏమిటి?
రంబుటాన్ పండు ప్రధానంగా మలేషియా ప్రాంతంలో పుట్టింది. తరువాత ఇది ఆసియా దేశాలతో పాటు ఇతర దేశాలకు కూడా విస్తరించింది. బయటకు చూస్తే ముళ్లలా ఉండే తొక్కతో కనిపించే ఈ పండు లోపల తెల్లని మృదువైన గుజ్జుతో ఉంటుంది. రుచిలో తీపి, స్వల్ప పులుపు కలగలిపిన ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఈ పండులో ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ B3, విటమిన్ C పుష్కలంగా ఉంటాయి.
పండు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చ రంగులో ఉంటుంది. పండిన తర్వాత ఎరుపు లేదా పసుపు రంగులోకి మారుతుంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ పండు సాగు చేస్తున్నారు.
గుండె ఆరోగ్యానికి రంబుటాన్ ఎలా ఉపయోగపడుతుంది?
రంబుటాన్ పండులో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోవడం తగ్గించడంలో సహాయపడతాయి. దీని వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ కారణాల వల్ల హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది.
శరీర శక్తి పెంపు, ఎదుగుదలకు సహాయం
రంబుటాన్‌లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. ఎక్కువగా శారీరక శ్రమ చేసే వారికి ఇది మంచి సహాయకారిగా పని చేస్తుంది. అలాగే ఈ పండు శరీర ఎదుగుదలకు సహాయపడుతుంది, ఎముకల బలానికి ఉపయోగపడుతుంది, శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. రెండు రంబుటాన్ పండ్లు తింటే రోజుకు అవసరమైన విటమిన్ Cలో కొంత భాగం పొందవచ్చు.
చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు
రంబుటాన్ పండును తరచుగా తింటే చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులో ఉన్న విటమిన్లు, ఖనిజాలు శరీర కణాల అభివృద్ధికి సహాయపడతాయి. దీని వల్ల జుట్టు మెరిసేలా ఉంటుంది, చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది, గోర్లు బలంగా మారుతాయి. అలాగే ఫాస్పరస్ ఉండటం వల్ల శరీరంలో ఉన్న అనవసర వ్యర్థాలను బయటకు పంపడంలో కూడా ఇది సహాయపడుతుంది.
బరువు నియంత్రణలో సహాయం
రంబుటాన్‌లో కాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో ఇది బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఉపయోగపడుతుంది. అయితే రంబుటాన్ పండు ఆరోగ్యానికి మంచిదే అయినా కొన్ని సందర్భాల్లో జాగ్రత్త అవసరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా
అధిక రక్తపోటు ఉన్నవారు, షుగర్ సమస్య ఉన్నవారు, గర్భిణీలు వైద్యుల సలహాతో మాత్రమే తీసుకోవాలి. అలాగే ఈ పండు జారుగా ఉండటంతో చిన్నపిల్లలు తింటప్పుడు గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. అందుకే పిల్లలకు ఇస్తప్పుడు పెద్దలు జాగ్రత్తగా ఉండాలి.