Ginger Side Effects: అల్లం ఎక్కువగా వాడితే అనర్థాలే.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ తెలుసుకోండి..!

Ginger Side Effects: చలికాలం అల్లం టీ తాగడానికి చాలామంది ఇష్టపడుతారు.

Update: 2023-01-24 01:30 GMT

Ginger Side Effects: అల్లం ఎక్కువగా వాడితే అనర్థాలే.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ తెలుసుకోండి..!

Ginger Side Effects: చలికాలం అల్లం టీ తాగడానికి చాలామంది ఇష్టపడుతారు. సాధారణంగా అల్లం ప్రభావం వేడిగా ఉంటుంది. అందుకే రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటారు. ఇది రుచి,ఆరోగ్యం వరకు బాగానే ఉంటుంది. కానీ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అల్లం వ్యాధులను నయం చేయడానికి పని చేస్తుంది అలాగే అనేక వ్యాధులకు కూడా కారణం అవుతుంది. అల్లం అధికంగా వాడటం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

రక్తాన్ని పలుచగా చేస్తుంది

అల్లంలో రక్తాన్ని పల్చగా చేసే గుణం ఉంటుంది. అల్లం ఎక్కువగా తినడం లేదా అల్లం టీ తాగడం వల్ల రక్తపోటు తగ్గే ప్రమాదం ఉంది. ఇందులో ఉండే అల్లిసిన్ రక్తపోటును తగ్గించేందుకు పనిచేస్తుంది. రోజూ 5 గ్రాముల అల్లం తింటే సరిపోతుంది. ఇంతకు మించి అల్లం తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.

అసిడిటీకి కారణం

అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఇది అసిడిటికి కారణం అవుతుంది. ఛాతీలో మంట సమస్య ఏర్పడుతుంది. అల్లం జీర్ణకోశ లేదా ప్రేగు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.

గర్భిణీలకి హానికరం

అల్లం అధిక వినియోగం గర్భిణీలకి మంచిదికాదు. అల్లం ఎక్కువగా తింటే కడుపు నొప్పి వస్తుంది. కడుపుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

చక్కెర స్థాయిని తగ్గిస్తుంది

అల్లం చక్కెర స్థాయిని తగ్గించడానికి పనిచేస్తుంది. ఇది హైపోగ్లైసీమియాకు కారణం కావచ్చు. రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటే అల్లం అధిక వినియోగాన్ని నివారించడం మంచిది.

Tags:    

Similar News