గురక సమస్యకు చెక్ పెట్టండిలా..

వంద మందిలో సుమారు 90 మందికి నిద్రలో గురకపెట్టే అలవాటు ఉంటుంది. గురకే కదా దీని వల్ల కలిగే అనర్థమేంటని అందరూ అనుకుంటుంటారు.

Update: 2020-02-08 09:54 GMT

వంద మందిలో సుమారు 90 మందికి నిద్రలో గురకపెట్టే అలవాటు ఉంటుంది. గురకే కదా దీని వల్ల కలిగే అనర్థమేంటని అందరూ అనుకుంటుంటారు..కానీ గురకపెట్టే వారికి సమస్య తీవ్రత ఎలా ఉంటుందో... ఆ గురక వల్ల పక్కవారు కూడా అన్నే సమస్యలు ఎదుర్కొంటుంటారు..గురకపెట్టేవారు హాయిగా పడుకుంటారు.. కానీ.. పక్కవారు మాత్రం నిద్రకు దూరమవ్వాల్సిందే...ఈ గురక వల్ల కంటి మీద కునుకు ఉండదు. కొన్ని గురకలు విసుగు పుట్టిస్తుంటే..మరికొన్న భయం కలిగిస్తాయి.. అయితే అసలు గురక ఎందుకు వవస్తుంది.. గురక రావడం వల్ల ఏదైనా అనోర్య సమస్య వస్తుందా.. ఇది ప్రమాదకరమా? గురక తగ్గించుకునేందకు మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే చిన్న పాటి చిట్కాల వల్ల ఈ గురక సమస్య నుంచి మనం బయటపడవచ్చు.

గురక సమస్య వేధిస్తుందని వైద్యులను ఆశ్రయించడం కంటే ఇంటి చిట్కాలను కొన్నింటిని పాటిస్తే మంచి ఉపశమనం పొందవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చేసేద్దాం.. మసాలాను వంటకు రుచిని అందించడమే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. దాల్చిన చెక్క ను పొడి చేసి టీస్పూన్ పొడిని తీసుకుని అందులో కాస్త తేనె కలుపుకుని తీసుకోవాలి... ఒలా తరుచుగా తీసుకోవడం వల్ల గురకకు చెక్ పెట్టవచ్చు. అటుకులు తిన్నా కూడా గురక సమస్య దూరమవుతుందంటా. ఇక టీస్పూన్ యాలకుల పొడిని ఒక గ్లాసెడు కాచిన నీటోలో కలిపి దీనిని పడుకునేముందు తీసుకుంటే గురక తగ్గుతుందంటున్నారు వైద్యులు. ..అటుకులకు కాస్త నీటిలో తడిపి పచ్చి అటుకుని గుప్పెడంత తీసుకుని వాటిని ప్రతి రోజు రాత్రి వేళలో నిద్రపోయేముందు తీసుకుంటే...గురకను అదుపులో ఉంచుకోవచ్చు.

శ్వాసనాళాల్లో ఉండే అడ్డంకుల వల్ల కూడా గురక సమస్య అందిరినీ వేధిస్తుంటుంది..మరి ఈ అడ్డంకులను పరాద్రోలేందుకు గోరువెచ్చని పాలల్లో పసుపు కలిపి తాగితే సరిపోతుంది...మంచి ఉపశమనాన్ని పొందవచ్చు. అదే విధంగా రాత్రి వేళలోభోంచేసే సమయంలో పచ్చి ఉల్లిపాయలను తీసుకుంటే కూడా చక్కటి ఫలితం దక్కుతుంది.

నిద్రపోయేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలను పాటించాలి...ఇష్టానుసారంగా పడుకోకుండా అంటే ముఖ్యంగా వెల్లికలా పడుకోకూడదు.. ఇలా పడుకోవడం వల్ల గురక తీవ్రత అధికంగా ఉంటుంది. కుడివైపుకో, ఎడమవైపుకో పడుకుంటే గురక అస్సలు రాదు..

అధిక బరువు కలిగిన వారినే గురక వేధిస్తుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా నాలుక కొవ్వును కరిగిస్తే గురకకు కళ్లెం వేయవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. కాబట్టి స్థూలకాయులు కాస్త ఆహార నియమాలను పాటించడం వల్ల గురక సమస్యకు చెక్ పెట్టవచ్చు. 

Tags:    

Similar News