Diwali 2022: దీపావళికి ముందే ఇంట్లోని ఈ చెత్త వస్తువులని తీసేయండి..!

Diwali 2022: దీపావళి పండుగ పరిశుభ్రతతో ముడిపడి ఉంటుంది.

Update: 2022-10-15 10:03 GMT

Diwali 2022: దీపావళికి ముందే ఇంట్లోని ఈ చెత్త వస్తువులని తీసేయండి..!

Diwali 2022: దీపావళి పండుగ పరిశుభ్రతతో ముడిపడి ఉంటుంది. ఇల్లు మురికిగా ఉంటే మాతా లక్ష్మీదేవి అస్సలు సహించదు. దీని వల్ల ధన నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది పేదరికానికి కారణం అవుతుంది. దీపావళికి ముందే ఇంట్లోని చెత్త వస్తువులని తీసివేయాలి. విరిగిన వస్తువులు, పనికిరాని బూట్లు, చిరిగిన బట్టలు మొదలైనవన్ని పారేయాలి. ఇంట్లోని ప్రతి మూలను పూర్తిగా శుభ్రం చేయాలి. అప్పుడే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి.

1. టాయిలెట్ సీటు

ప్రతిరోజూ ఉపయోగించే కొన్ని వస్తువులు బ్యాక్టీరియాకి పుట్టినిల్లని చెప్పవచ్చు. వీటిని శుభ్రంగా ఉంచాలి. మీ టాయిలెట్ షీట్ చాలా పాతది అయితే దీపావళి క్లీనింగ్ సమయంలో ఖచ్చితంగా దాన్ని మార్చండి. టాయిలెట్ సీట్లలో మిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా ఉంటుందని చాలా పరిశోధనలలో తేలింది.

2. కిచెన్ సింక్

మీ కిచెన్‌లోని సింక్ చాలా పాతదై ఉంటే వెంటనే కొత్తది తీసుకురావడానికి ప్రయత్నించండి. వాస్తవానికి నోరోవైరస్, హెపటైటిస్ ఎ వంటి ప్రాణాంతక బ్యాక్టీరియా అపరిశుభ్రంగా ఉండే సింక్‌లో నివసిస్తాయి. ఈ దీపావళికి కొత్త సింక్‌ ఏర్పాటు చేస్తే మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడినవారు అవుతారు.

3. రిమోట్ కంట్రోల్, ఫ్రిజ్ కవర్, మొబైల్ కవర్

మీ ఇంట్లో టీవీ, ఏసీలకి ప్రత్యేక రిమోట్‌లు ఉంటాయి. ఈసారి దీపావళి క్లీనింగ్‌లో ఇంటి కర్టెన్‌లను మార్చడమే కాకుండా రిమోట్‌లను కూడా మార్చండి. రిఫ్రిజిరేటర్ కవర్‌ను కొత్తగా వేస్తే ఇంకా మంచిది. అంతేకాకుండా మీరు వాడే మొబైల్ పాత కవర్‌ను కూడా మార్చండి. వాస్తవానికి మొబైల్ ఫోన్, టాయిలెట్ కంటే ఎక్కువ బ్యాక్టీరియాకు నిలయమని చాలా నివేదికలలో తేలింది.

4. వెజిటబుల్ చాపింగ్ చాపింగ్ బోర్డ్

వంటగదిలోని చాపింగ్ బోర్డ్ చాలా ప్రమాదకరమైన బ్యాక్టీరియాకు నిలయం. వీటిపై సాల్మోనెల్లా, ఈ-కోలి లాంటి బ్యాక్టీరియా ఉంటుంది. వీటిని కూడా ఈ పండగకి మార్చేయండి. ఎందుకంటే ఏదైనా కాలానుగుణంగా మార్చాలి.

5. డిష్‌వాషర్ స్క్రబ్బర్

చాలామంది డిష్‌వాషర్ స్క్రబ్బర్‌ని చిరిగిపోయే వరకు వాడుతారు. ఇది మంచిపద్దతి కాదు. పండుగ సందర్భంగా కిచెన్ శుభ్రం చేసే సమయంలో పాత స్క్రబ్బర్‌ని పారేసి కొత్తవి తీసుకోండి. వాస్తవానికి 15 రోజులకి ఒకసారి స్క్రబ్బర్ మార్చాలి.

Tags:    

Similar News