Health Tips: ఆస్తమా రోగులకి ఈ పండ్లు దివ్యఔషధం.. అవేంటంటే..?

Health Tips: పెరుగుతున్న కాలుష్యం కారణంగా ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుననారు.

Update: 2022-11-12 03:45 GMT

Health Tips: ఆస్తమా రోగులకి ఈ పండ్లు దివ్యఔషధం.. అవేంటంటే..?

Health Tips: పెరుగుతున్న కాలుష్యం కారణంగా ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుననారు. అంతేకాదు ఆస్తమా రోగుల సమస్య చాలా వేగంగా పెరుగుతోంది. ఆస్తమా అనేది ఒక నయం చేయలేని వ్యాధి. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నియంత్రించవచ్చు. ఆస్తమా రోగులు తినాల్సిన కొన్ని ప్రత్యేక పండ్లు ఉన్నాయి. ఇవి ఆస్తమాని కంట్రోల్ చేయడానికి పనిచేస్తాయి. వీటిని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఆపిల్

మీరు ఆస్తమా లక్షణాలను తగ్గించుకోవాలనుకుంటే ఆహారంలో ఎక్కువ పండ్లను చేర్చుకోవాలి. ఈ పండ్లలో ఆపిల్ ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో పెద్ద మొత్తంలో బీటా కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఈ ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తుల వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

నారింజ

నారింజ ఆస్తమా రోగులకు దివ్యవౌషధమని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ ఒక నారింజను తీసుకుంటే అది ఆస్తమాను నియంత్రించడంలో సహాయపడుతుంది.

జామ

విటమిన్ సి పుష్కలంగా ఉండే జామ ఆస్తమా రోగులకు చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజూ జామపండును తీసుకుంటే అది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి ఆస్తమా రోగులు తప్పనిసరిగా ఆహారంలో జామను చేర్చుకోవాలి.

స్ట్రాబెర్రీ

మీరు ఆస్తమా రోగి అయితే స్ట్రాబెర్రీలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇది విటమిన్ సి మూలం. ఇది ఊపిరితిత్తుల వాపును తగ్గిస్తుంది. స్ట్రాబెర్రీలను తప్పనిసరిగా డైట్‌లో చేర్చుకోవాలి.

Tags:    

Similar News