Health Tips: ఈ దేశీ ఆహారాలు గుండెపోటుని నివారిస్తాయి.. ఎలాగంటే..?

Health Tips: గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడానికి కొంతమంది రక్తాన్ని పల్చగా మార్చే మందులు తీసుకుంటారు.

Update: 2022-07-20 06:30 GMT

Health Tips: ఈ దేశీ ఆహారాలు గుండెపోటుని నివారిస్తాయి.. ఎలాగంటే..?

Health Tips: గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడానికి కొంతమంది రక్తాన్ని పల్చగా మార్చే మందులు తీసుకుంటారు. ఈ మందులను బ్లడ్ థిన్నర్స్ అంటారు. రక్తం గడ్డకట్టకుండా నిరోధించడానికి రక్త కణాలు ఒకదానితో ఒకటి అంటుకోకుండా ఇవి నిరోధిస్తాయి. అయితే కొన్ని దేశవాళీ పదార్దాలు తింటే రక్తం పలుచబడాల్సిన అవసరం ఉండదు. వాస్తవానికి రక్తం చిక్కబడినప్పుడు తలనొప్పి, అధిక రక్తపోటు, దురద, మసకబారడం, కీళ్లనొప్పులు, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

విటమిన్ ఈ

విటమిన్ ఈ రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. బ్లడ్ థినర్స్ వంటి మందులు తీసుకునే వ్యక్తులు విటమిన్ ఈ సప్లిమెంట్లకు దూరంగా ఉండాలి. విటమిన్ ఈ సహజంగా రక్తాన్ని పలుచగా చేస్తుంది. మీరు పాలకూర, బాదం వంటివి తినవచ్చు.

పసుపు

ఆహారంలో ఉపయోగించే పసుపు సహజంగా రక్తాన్ని పలుచగా చేస్తుంది. పసుపులో కర్కుమిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది రక్తాన్ని పలుచగా చేసి రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. వంట చేసేటప్పుడు పసుపు వేసుకొని తినవచ్చు.

వెల్లుల్లి

ప్రజలు ఆహారం రుచిని పెంచడానికి వెల్లుల్లిని తింటారు కానీ వెల్లుల్లి సహజమైన యాంటీబయాటిక్. ఇందులో యాంటీథ్రాంబోటిక్ ఏజెంట్ ఉంటుంది. ఇది రక్తాన్ని పలుచగా చేసి రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.

ఎర్ర మిరపకాయ

ఎర్ర మిరపకాయ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి రక్తం పలుచబడటానికి సహాయపడుతాయి. ఎర్ర మిరపకాయలలో సాలిసిలేట్లు కనిపిస్తాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.

అల్లం

అల్లం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మసాలా. అల్లం ఆస్పిరిన్ సాలిసైలేట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శక్తివంతమైన బ్లడ్ థినర్‌గా పనిచేస్తుంది. ప్రజలు టీ, ఆహారంలో అల్లం కలుపుకొని తీసుకోవచ్చు.

Tags:    

Similar News