Health Tips: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిలో ఈ మార్పులు తప్పనిసరి..!

Health Tips: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిలో ఈ మార్పులు తప్పనిసరి..!

Update: 2022-12-24 04:30 GMT

Health Tips: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిలో ఈ మార్పులు తప్పనిసరి..!

Health Tips: మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవాలు. ఇవి ఫిల్టర్ మాదిరి పనిచేస్తాయి. ఇవి లేకుండా శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను బయటకు పంపడం సాధ్యం కాదు. ఒకవేళ శరీరంలో టాక్సిన్స్‌ అలాగే ఉండిపోతే చాలా రకాల వ్యాధులు సంభవిస్తాయి. అందుకే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవాలని ప్రతి వైద్యుడు సలహా ఇస్తాడు. కిడ్నీలు పాడైపోకుండా ఉండాలంటే దినచర్యలో కొన్ని ప్రత్యేక మార్పులు చేసుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

కిడ్నీలో ఏదైనా లోపం ఉంటే శరీరంలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి.

1. చర్మం రంగు మరింత తెల్లగా మారుతుంది

2. చర్మం చాలా పొడిగా మారుతుంది.

3. గోళ్లలో తెల్లదనం వస్తుంది.

4. గోళ్లు బలహీనంగా మారుతాయి.

5. దురద స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి.

1. బరువు నియంత్రణ

బరువు పెరగడం మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది కాదు. దీని వల్ల కిడ్నీలకు చాలా నష్టం వాటిల్లుతోంది. అంతేకాదు అధిక బరువు వల్ల మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు సమస్య ఏర్పడుతుంది.

2. నిద్ర భంగం

నిద్ర, మేల్కొనే సమయాన్ని సరిచేయాలి. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం చెక్కుచెదరకుండా ఉంటుంది.

3. శారీరక కార్యకలాపాలు

రోజులో దాదాపు అరగంట పాటు వ్యాయామం లేదా మరేదైనా శారీరక శ్రమ చేస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కిడ్నీ సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

Tags:    

Similar News