Health Tips: బలహీనమైన ఎముకలకి కారణం ఈ చెడ్డ అలవాట్లే..!

Health Tips: మన శరీరం ఫిట్‌గా ఉండాలంటే ఎముకలు దృఢంగా ఉండాలి.

Update: 2022-11-08 07:19 GMT

Health Tips: బలహీనమైన ఎముకలకి కారణం ఈ చెడ్డ అలవాట్లే..!

Health Tips: మన శరీరం ఫిట్‌గా ఉండాలంటే ఎముకలు దృఢంగా ఉండాలి. కానీ మారిన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా బలహీనంగా మారుతాయి. మనం తీసుకునే కొన్నిఆహారాలు మన బాడీ నుంచి కాల్షియాన్ని బయటికి పంపిస్తాయి. ఇవి ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. వాస్తవానికి ఎముకల గట్టితనం అనేది మనం తీసుకునే కాల్షియంపై ఆధారపడి ఉంటుంది. అయితే బోన్స్‌ వీక్‌కి గల కారణాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. కూల్‌ డ్రింక్స్‌

నేటి కాలంలో కూల్‌ డ్రింక్స్‌, కార్బోనేటేడ్ పానీయాల వినియోగం చాలా పెరిగింది. తరచుగా మనం పెళ్లిళ్లు, పార్టీలు లేదా రోజువారీ జీవితంలో వాటిని పెద్ద మొత్తంలో తాగుతున్నాం. ఈ పానీయాలలో ఫాస్ఫేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరం నుంచి కాల్షియంను తగ్గిస్తుంది.

2. ఎక్కువ టెన్షన్

మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరిస్తేనే హెల్దీగా ఉంటారు. సాధారణంగా ప్రేమ విఫలమవడం, స్నేహంలో మోసం చేయడం, డబ్బు లేకపోవడం, ఆఫీసులో సమస్యలు, తీవ్రమైన అనారోగ్యం వంటి కారణాల వల్ల చాలామంది తీవ్ర ఒత్తిడికి లోనువుతారు. దీనివల్ల ఎముకలు పెళుసుగా మారుతాయి. ఎందుకంటే ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్‌ ఉత్పత్తి అవుతుంది. దీని కారణంగా శరీరం నుంచి కాల్షియం బయటికి వెళ్లిపోతుంది. దీంతో ఎముకలు బలహీనంగా మారుతాయి.

3. టీ, కాఫీ ఎక్కువగా తాగడం

భారతదేశంలో టీ, కాఫీ తాగే వారి సంఖ్య చాలా ఎక్కువ. ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు టీ, కాఫీని తాగుతూనే ఉంటారు. ఈ పానీయాలలో కెఫిన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియం అవసరాన్ని పెంచుతుంది. ఈ అలవాట్ల వల్ల మీరు కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News