Dengue: డెంగ్యూ జ్వరానికి ఈ గ్రీన్‌ జ్యూస్‌ దివ్యౌషధం..!

Dengue: వర్షాకాలం సీజనల్‌ వ్యాధులని మోసుకొస్తుంది.

Update: 2022-08-25 14:45 GMT

Dengue: డెంగ్యూ జ్వరానికి ఈ గ్రీన్‌ జ్యూస్‌ దివ్యౌషధం..!

Dengue: వర్షాకాలం సీజనల్‌ వ్యాధులని మోసుకొస్తుంది. సాధారణంగా చెరువులు, కుంటలు, కొబ్బరి చిప్పలు, ఖాళీ కుండలు వంటి వాటిలో నీరు నిలిచి డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతాయి. ఈ దోమలను నివారించడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవి ఒకసారి దాడి చేస్తే మన రక్తంలో ప్లేట్‌లెట్ల పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది. శరీరం పూర్తిగా బలహీనమవుతుంది. మీకు కూడా డెంగ్యూ వ్యాధి వచ్చినట్లయితే గోధుమ గడ్డి రసం తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

గోధుమ గడ్డి రసం

గోధుమ గడ్డి రసం ఆయుర్వేద ఔషధం కంటే తక్కువేమి కాదు. ఇందులో విటమిన్-సి, విటమిన్-ఈ, మినరల్స్, ఫైబర్, ప్రొటీన్, క్లోరోఫిల్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఈ పచ్చి రసాన్ని రోజూ తాగితే శరీరంలో పోషకాలకు లోటు ఉండదు. గోధుమ గడ్డి రసం సీజనల్ వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మీరు దీన్ని క్రమం తప్పకుండా తాగితే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు దరిచేరవు.

మీకు డెంగ్యూ వచ్చినట్లయితే గోధుమ గడ్డి రసం తీసుకోవడం వల్ల రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. మీ ప్రాణాలకు ముప్పు ఉండదు. డెంగ్యూ ప్రాణాంతక వ్యాధి దీనికి గోధుమ గడ్డి బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా డెంగ్యూ జ్వరం ఆడ ఈడిస్ ఈజిప్టి దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇవి ప్రత్యేకమైన దోమలు. వాటి శరీరంపై చిరుతపులి లాంటి చారలు ఉంటాయి. ముఖ్యంగా పగటిపూట ఈ దోమలు మనుషులను కుడతాయి. కావున రాత్రిపూట కాకుండా పగలు వెలుతురులో దోమలను తరిమికొట్టేలా చర్యలు తీసుకోవాలని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News