Pomodoro Technique: పని ఒత్తిడిని పోగొట్టే పోమొడోరో టెక్నిక్! స్టెప్స్ ఇలా..
ఆఫీసులో సమయానికి టాస్క్ పూర్తి కాకపోతే ఉండే ఒత్తిడి అంతాఇంతా కాదు. అలాగని అదేపనిగా గ్యాప్ లేకుండా పని చేస్తే అదొక ఒత్తిడి.
Pomodoro Technique: పని ఒత్తిడిని పోగొట్టే పోమొడోరో టెక్నిక్! స్టెప్స్ ఇలా..
ఆఫీసులో సమయానికి టాస్క్ పూర్తి కాకపోతే ఉండే ఒత్తిడి అంతాఇంతా కాదు. అలాగని అదేపనిగా గ్యాప్ లేకుండా పని చేస్తే అదొక ఒత్తిడి. మరి ఈ పని ఒత్తిడిని తగ్గించేదెలా?
పని చేస్తూనే ఒత్తిడి లేకుండా చూసుకునేందుకు ‘పోమొడోరో’ అనే టెక్నిక్ బాగా పనికొస్తుంది. ఈ టెక్నిక్ ద్వారా టైంని, వర్క్‌ను బ్యాలెస్స్ చేస్తూ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అందుకే పెద్ద పెద్ద సీఈవోలు కూడా ఈ టెక్నిక్‌ను ఫాలో అవుతుంటారు. పనిచేసే ఉద్యోగుల నుంచి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల వరకూ అందరికీ ఈ టెక్నిక్ పనికొస్తుంది. ఇదెలా ఉంటుందంటే..
ఒక టైమర్‌ని సెట్ చేసుకొని దాని ప్రకారం పని చేసుకుంటూ పోవడమే ఈ పోమొడోరో టెక్నిక్ ప్రధాన ఉద్దేశం. ముందుగా చేయాల్సిన పనులను లిస్ట్ రాసుకోవాలి. ఆ తర్వాత వాటి గురించి ఆలోచించకుండా టైమర్ ప్రకారం పని చేసుకుంటూ పోవాలి.
ముందుగా 25 నిమిషాల టైమర్‌ని సెట్ చేసుకొని.. పూర్తి ఫోకస్ పెట్టి పని చేయాలి. టైం పూర్తికాగానే అలారం మోగుతుంది. ఇప్పుడు 5 నిమిషాలు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. ఇలా ఒక పోమొడోరో పూర్తయినట్టు.
ఇక రెండో సైకిల్‌లో మళ్లీ అలారం మోగగానే మరో 25 నిమిషాలు పూర్తి శ్రద్ధతో పనిచేయాలి. సమయం పూర్తవగానే మళ్లీ 5 నిముషాల బ్రేక్. ఇలా నాలుగు పోమొడోరోలు అంటే.. సుమారు రెండు గంటలు పూర్తయ్యాక 20 నిముషాల పాటు లాంగ్ బ్రేక్ తీసుకోవాలి. రోజంతా ఇదే టెక్నిక్‌తో పనిచేసుకుంటూ పోవాలి. ఇదే పోమొడోరో పద్ధతి.
లాభాలివే..
ఈ పద్ధతిలో పనిచేయడం ద్వారా పని ఒత్తిడి తగ్గుతుందని సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది. ఈ టెక్నిక్‌ను కొన్ని రోజులపాటు ప్రాక్టిస్ చేస్తే మరింత తేలిగ్గా ఒత్తిడి లేకుండా పని చేసుకోగలుగుతారు.
పోమొడోరో టెక్నిక్ వల్ల పనిపై ఫోకస్ కూడా పెరుగుతుంది. తద్వారా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఒత్తిడి ఫీలవ్వకుండానే ప్రొడక్టివిటీని పెంచుకోవచ్చు.
లాంగ్ టర్మ్‌లో ఈ టెక్నిక్‌ను ఫాలో అవ్వడం ద్వారా పని వేగం పెరగడంతో పాటు టార్గెట్లు త్వరగా పూర్తవుతాయి. ఓవరాల్ వర్కింగ్ స్టైల్‌ను మార్చగలిగే సామర్థ్యం ఈ టెక్నిక్ కు ఉంది.
అన్నింటికంటే ముఖ్యంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌కు ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. పనిలో ఒత్తిడి లేకపోవడం వల్ల పర్సనల్ లైఫ్‌పై ఎలాంటి నెగెటివ్ ఎఫెక్ట్ పడదు. తద్వారా పనిని, పర్సనల్ లైఫ్‌ను చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు.