Health: ఈ పువ్వు శరీరంలో రక్తం కొరతని తీర్చుతుంది.. ఎలాగంటే..?

Health: రక్తం లేకపోవడం వల్ల శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. ఈ పరిస్థితిలో మీరు సకాలంలో చికిత్స పొందాలి.

Update: 2022-05-30 14:30 GMT

Health: ఈ పువ్వు శరీరంలో రక్తం కొరతని తీర్చుతుంది.. ఎలాగంటే..?

Health: రక్తం లేకపోవడం వల్ల శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. ఈ పరిస్థితిలో మీరు సకాలంలో చికిత్స పొందాలి. లేదంటే సమస్య అంతకంతకు పెరుగుతుంది. రక్తహీనత ఏర్పడినప్పుడు దానిమ్మ, బీట్‌రూట్ ఎక్కువగా తినాలి. అయితే కొందరి సమస్యలు ఇంతటితో తీరవు. వీరు మందుల సాయం తీసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని నివారించడానికి సహజమైన మార్గం ఒకటి ఉంది. ఇది శరీరంలో రక్తం కొరతని తీరుస్తుంది. అదేంటో తెలుసుకుందాం.

అరటి పువ్వులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో చాలా విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. దీని వల్ల రక్తహీనత, మధుమేహం, ఇన్ఫెక్షన్‌ను తొలగించడం, అధిక రక్తస్రావం, పీరియడ్స్ సమయంలో నొప్పి తగ్గడం జరుగుతాయి. అయితే దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

అరటి పువ్వును కషాయం మాదిరి తయారుచేసి తాగాలి. మీరు దీని నుంచి మంచి ప్రయోజనం పొందుతారు. ఇందుకోసం మీరు అరటి పువ్వులను ఒక గ్లాసు నీటిలో ఉడకబెట్టాలి. దానికి కొద్దిగా ఉప్పు కలపాలి. అది వేడెక్కిన తర్వాత గ్యాస్ నుంచి దించాలి. చల్లబడిన తర్వాత మీరు నల్ల మిరియాలు, అర టీస్పూన్ గ్రౌండ్ జీలకర్రను జోడించాలి. ఇప్పుడు మళ్లీ గ్యాస్‌పై మరిగించాలి. అంతే కషాయం సిద్దమైనట్లే. చల్లారిన తర్వాత కొంచెం పెరుగు కలుపుకుని తాగవచ్చు.

Tags:    

Similar News