Health Tips: ఫుల్ బిజీగా ఉంటూ హెల్త్ నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఈ చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు.. పుష్టిగా ఉంటారు..!

Health Tips: ప్రస్తుత కాలంలో చాలా మంది బిజీ షెడ్యూల్‌ కారణంగా ఆరోగ్యంపై ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదు.

Update: 2025-05-14 14:08 GMT

Health Tips: ఫుల్ బిజీగా ఉంటూ హెల్త్ నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఈ చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు.. పుష్టిగా ఉంటారు..

Health Tips: ప్రస్తుత కాలంలో చాలా మంది బిజీ షెడ్యూల్‌ కారణంగా ఆరోగ్యంపై ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదు. బిజీగా ఉండేవారికి సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే, ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి మీరు మీ లైఫ్ స్టైల్‌లో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

స్నాక్స్ తీసుకెళ్లండి

మీ బిజీ షెడ్యూల్ మధ్య ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, మీతో పాటు కొన్ని ఆరోగ్యకరమైన స్నాక్స్ ప్యాక్ చేసుకుని వెళ్ళండి. ఆరోగ్యకరమైన స్నాక్స్ మీ ఆకలిని తీర్చుతాయి. అప్పుడు జంక్ ఫుడ్ తినాల్సిన అవసరం ఉండదు. గింజలు, తాజా పండ్లు, క్యారెట్లు మీతో తీసుకెళ్లడం మంచిది. ఫ్రీగా ఉన్న సమయంలో వాటిని తినండి.

మద్యం, రెస్టారెంట్ ఆహారాన్ని నివారించండి

ఆల్కహాల్, రెస్టారెంట్ ఫుడ్ ఈ రెండింటిలో కేలరీలు ఎక్కువగా ఉండి పోషకాలు తక్కువగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని అలసిపోయేలా, నీరసంగా చేస్తాయి. ఆఫీసు పని కోసం బయటకు వెళ్లినప్పుడు ఆరోగ్యకరమైన జ్యూస్‌ తాగండి.

పుష్కలంగా నీరు తాగాలి

తరచుగా ప్రజలు పని చేస్తున్నప్పుడు నీరు తాగటం మర్చిపోతారు. అయితే, ఎక్కువ నీరు తీసుకోవడం ద్వారా మీరు కేలరీలను ఆదా చేసుకోవచ్చు. శారీరకంగా మెరుగ్గా ఉండవచ్చు. కాబట్టి, మీరు ఎక్కడికి వెళ్లినా మీతో వాటర్ బాటిల్ తీసుకెళ్లండి. ఫ్రీగా ఉన్నప్పుడు నీరు తాగుతూ మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోండి.

ఒక గంట ముందు నిద్ర లేవండి

చాలా మంది ఆఫీస్‌కు వెళ్లే అరగంట ముందు నిద్రలేచి హాడావిడి పడుతుంటారు. అయితే, ఇలా కాకుండా మీరు ఆఫీస్‌ వెళ్లాడానికి ఒక గంట ముందే నిద్ర లేవడం మంచిది. తర్వాత ఫ్రెష్‌ అయి వ్యాయామం చేయండి. మీరు రోజు ఉదయాన్నే వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు.

మంచి నిద్ర

మీకు బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు, ఆలస్యంగా పడుకుని త్వరగా నిద్రలేవడం ఉత్సాహంగా అనిపించవచ్చు. కానీ, ప్రతి ఒక్కరికీ 7 నుండి 9 గంటల నిద్ర అవసరం. కాబట్టి, మీ షెడ్యూల్‌ను పరిశీలించి, ఆరోగ్యకరమైన సమయంలో పడుకోవడానికి మీరు మార్పులు చేసుకోండి. 

Tags:    

Similar News