Lifestyle: విటమిన్ E ఎక్కువైతే ఏమవుతుందో తెలుసా? నిపుణులు ఏమంటున్నారంటే
విటమిన్ E ఎక్కువైతే ఆరోగ్యానికి హానికరమా?
Side effects of excess vitamin E: శరీరానికి విటమిన్లు అవసరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా విటమిన్లు లభించాల్సిందే. వీటిలో ప్రధానమైన వాటిలో విటమిన్ ఇ ఒకటి. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదే విధంగా ఆక్సీకరణ నష్టం నుంచి కణాలను రక్షించడంలో, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ ఈ ముఖ్యంగా విత్తనాలు, గింజలు, కూరగాయలలో లభిస్తుంది. అయితే ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ఈ ఎక్కువైనా ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
అనేక అధ్యయనాల ప్రకారం, విటమిన్ ఇ ఊపిరితిత్తుల పనితీరు, మానసిక ఆరోగ్యం, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని తేలింది. అయితే విటమిన్ ఈ శరీరానికి ఎక్కువ మొత్తంలో లభించినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి రోజుకు 100 ఎమ్‌జీ లోపు విటమిన్ ఈ సరిపోతుంది. అంతకంటే ఎక్కువైతే కొన్ని సమస్యలు తప్పవని అంటున్నారు. విటమిన్ ఈ ఎక్కువైతే వికారం, అలసట నుంచి బ్రెయిన్ స్ట్రోక్, రక్తస్రావం, కండరాల బలహీనత వంటి లక్షణాలకు దారి తీస్తుందని చెబుతున్నారు.
అలాగే శరీరంలో విటమిన్ ఏ మోతాదుకు మించితే జీర్ణశయాంతర రక్తస్రావం, ఇంట్రాక్రానియల్ బ్లీడింగ్ వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం శరీరంలో విటమిన్ ఇ ఎక్కువైతే మనిషి చనిపోయే అవకాశం కూడా ఉందని అంటున్నారు. విటమిన్ ఇ అధికంగా తీసుకోవడం వల్ల వికారం, తలనొప్పి, విరేచనాలు, కడుపు తిమ్మిర్లు, అలసట వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. అలాగే శరీరంలో విటమిన్ ఈ ఎక్కువైతే.. స్ట్రోక్, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుందని అంటున్నారు.