Lungs: కరోనా సమయంలో ఊపిరితిత్తులు జర భద్రం.. ఎందుకంటే..?

Lungs: కరోనా సమయంలో ఊపిరితిత్తుల ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. ఎందుకంటే వైరస్‌ ముఖ్యంగా శ్వాస వ్యవస్థపైనే దాడి చేస్తుంది.

Update: 2022-01-31 08:13 GMT

Lungs: కరోనా సమయంలో ఊపిరితిత్తులు జర భద్రం.. ఎందుకంటే..?

Lungs: కరోనా సమయంలో ఊపిరితిత్తుల ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. ఎందుకంటే వైరస్‌ ముఖ్యంగా శ్వాస వ్యవస్థపైనే దాడి చేస్తుంది. ఇందులో ఊపిరితిత్తులు ప్రధాన అవయవాలు. శ్వాస తీసుకోవడం ఆగిపోతే మనిషి చనిపోతాడనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే చాలామంది కరోనా సోకి కోలుకున్నా కూడా లక్షణాలు విడిచిపెట్టడం లేదు. దీనికి తోడు చెడు అలవాట్ల కారణంగా కూడా ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. ఇలాంటి సమయంలో వీటికి చెడు చేసే అలవాట్లను వదిలిపెట్టడం మంచిది. అవేంటో చూద్దాం.

1. పొగ తాగడం

పొగ తాగడం క్యాన్సర్‌కి కారణం అవుతుంది. అయినా కూడా జనాలు ఈ అలవాటుని మానుకోలేకపోతున్నారు. ఇది ఊపిరితిత్తులకు విషంగా పరిగణిస్తారు. చెడు ప్రభావం చూపే ధూమపానం ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది. సిగరెట్ తాగడం వల్ల మన ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం. ఇప్పటికైనా ఈ అలవాటుని విడిచిపెడితే మంచిది.

2. చక్కెర ఉత్పత్తులు

చక్కెర ఉత్పత్తులు కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే చక్కెర స్లో పాయిజన్. దీని వినియోగం ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి చక్కెర పానీయాలకు దూరంగా ఉండటం మంచిది.

3. వేయించిన ఆహారం

సమయం లేని కారణంగా చాలామంది రెడిమెడ్‌గా తయారుచేసిన వేయించిన ఆహారానికి అలవాటు అవుతున్నారు. ఇది చాలా డేంజర్. ఈ ఆహారాలకు వాడే నూనెలు ఊపిరితిత్తులకు అనేక విధాలుగా హాని కలిగిస్తాయి. గుండె జబ్బులను కూడా కారణమవుతాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ప్రయత్నించండి.

4. అధిక ఉప్పు

ఆహారంలో ఉప్పు లేనిదే రుచి ఉండదు. కానీ అనుకున్న దానికంటే ఎక్కువగా తింటే చాలా ప్రమాదం. ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుంది. రోజూ ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. అదే సమయంలో ఊపిరితిత్తులపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. అందుకే ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిదని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News