Health Tips: శాకాహారులు చింతించవద్దు.. గుడ్లు, మాంసం కంటే ఈ పండ్లలో ప్రోటీన్లు పుష్కలం..!

Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరైన మోతాదులో ప్రొటీన్లు అందాలి.

Update: 2023-08-09 16:00 GMT

Health Tips: శాకాహారులు చింతించవద్దు.. గుడ్లు, మాంసం కంటే ఈ పండ్లలో ప్రోటీన్లు పుష్కలం..!

Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరైన మోతాదులో ప్రొటీన్లు అందాలి. ఇందుకోసం మంచి డైట్ పాటించాలి. మాంసం, గుడ్లు, చేపలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుందని అందరికి తెలుసు. కానీ ఈ ఆహారాలని అందరు తినలేరు. కొంతమంది శాకాహారులు కూడా ఉంటారు వీరు తరచుగా ప్రొటీన్‌ లోపంతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని రకాల పండ్లని ఆహారంలో చేర్చుకోవాలి. వీటివల్ల శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్లు లభిస్తాయి. అలాంటి పండ్ల గురించి ఈరోజు తెలుసుకుందాం.

1. నారింజ

నారింజ పండు అద్భుతమైన పండు. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఇందులో ఉంటుంది. కండరాలను బలపరిచే ప్రోటీన్ కూడా లభిస్తుంది. అందుకే తప్పకుండా ఆరెంజ్‌ని రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకోవాలి.

2. జామ

జామను పేదవారి పండుగా పిలుస్తారు. జీర్ణక్రియకు ఒక ముఖ్యమైన పండుగా పరిగణిస్తారు. ఇందులో ప్రొటీన్లు ఉంటాయిని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. తరిగిన జామ పండ్లలో దాదాపు 4.2 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. వీటిని నేరుగా తీసుకోవడం మంచిది.

3. అవకాడో

అవోకాడోలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఒక గిన్నె అవోకాడో తింటే శరీరానికి 4 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇందులో అనేక పోషక విలువలు ఉంటాయి. ప్రొటీన్లు ఉండటం వల్ల శరీరానికి తగినంత బలం చేకూరుతుంది.

4. కివి పండు

కివి రుచి అందరినీ ఆకర్షిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక కివి పండు తినడం వల్ల దాదాపు 2.1 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అనేక ఇతర పోషకాలు కూడా ఇందులో లభిస్తాయి. 

Tags:    

Similar News