Gooseberry: ఈ సమస్యలుంటే ఉసిరికాయ తినకూడదు.. ఎందుకంటే..?

Gooseberry: ఉసిరిని చలికాలంలో ఎక్కువగా వాడుతారు. ఇందులో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయి.

Update: 2022-02-02 15:53 GMT

Gooseberry: ఈ సమస్యలుంటే ఉసిరికాయ తినకూడదు.. ఎందుకంటే..?

Gooseberry: ఉసిరిని చలికాలంలో ఎక్కువగా వాడుతారు. ఇందులో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి ఉసిరిని ఆయుర్వేదంలో వినియోగించేవారు. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలని పరిష్కరిస్తుంది. ఉసిరిలో విటమన్ సి ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఊపిరితిత్తులు, కాలేయం, జీర్ణమండలం మొదలైన వాటి సమస్యలకు తగ్గించడానికి దోహదపడుతుంది. అయితే ఉసిరిని తగినంతగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే అనర్థాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆరోగ్య సమస్యలున్నవారు అస్సలు తినకూడదు.

రక్త సంబంధిత రుగ్మతలున్నవారు తినకూడదు

ఉసిరిలో యాంటీ ప్లేట్లెట్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించవచ్చు. ఉసిరికాయ వినియోగం సాధారణ ప్రజలకు మంచిది ఎందుకంటే ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. కానీ ఇప్పటికే రక్త సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఉసిరి హానికరం అని నిరూపణ అయింది. అలాంటి వారు ఆహారంలో ఉసిరిని చేర్చుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

ఆమ్లత్వం

తరచుగా ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు ఉసిరి తినకుండా ఉండాలి. ముఖ్యంగా ఉసిరి చట్నీవారికి చాలా హానికరం. ఉసిరి ఆమ్ల లక్షణాలతో పాటు చట్నీలో వాడే మసాలాలు ఆమ్లతను విపరీతంగా పెంచుతాయి. అలాంటి వారు ఉసిరికి దూరంగా ఉండాలి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

మలబద్ధకం

ఉసిరి పొట్ట సమస్యలకు చాలా మంచిదని భావిస్తారు ఎందుకంటే ఇందులో సరైన మొత్తంలో ఫైబర్ ఉంటుంది. అయితే పరిమితికి మించి తీసుకుంటే పొట్టలో పీచు ఎక్కువగా చేరి మలబద్ధకం సమస్య రావచ్చు. మీరు ఉసిరికాయను ఎక్కువగా తిన్నట్లయితే ఎక్కువ నీరు తాగండి. మలబద్ధకం సమస్య ఉన్నవారు ఉసిరిని తినకపోవడమే మంచిది.

పొడిబారడం

శరీరంలో నీటి కొరత ఉంటే ఉసిరిని నివారించాలి. ఇందులో ఉండే మూలకాలు శరీరం పొడిబారడానికి కారణమవుతాయని చెబుతారు. మీరు ఉసిరి తినాలనుకుంటే ఎక్కువ నీరు తాగాలని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News