Health Tips: పసుపు పాలు మాత్రమే కాదు నీరు కూడా ఉపయోగమే..!

Health Tips: పసుపు పాలు మాత్రమే కాదు పసుపు నీరు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Update: 2022-03-26 14:30 GMT

Health Tips: పసుపు పాలు మాత్రమే కాదు నీరు కూడా ఉపయోగమే..!

Health Tips: పసుపు పాలు మాత్రమే కాదు పసుపు నీరు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీరు పసుపు నీరు తాగకపోతే ఈరోజే అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇందులో ఉండే అద్భుతమైన ప్రయోజనాలు మీ ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. దీంతో శరీరంలోని అనేక సమస్యలు దూరం అవుతాయి. పాలతో పసుపు కలిపి తీసుకుంటే మేలు జరుగుతుందని అందరికి తెలుసు. కానీ పసుపు నీరు తాగినా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

దాదాపు ప్రతి భారతీయ వంటగదిలో పసుపును ఉపయోగిస్తారు. దీనిని అనేక ఆయుర్వేద ఔషధాలలో కూడా వినియోగిస్తారు. పసుపు ఆహారం రుచిని పెంచడమే కాకుండా శరీరంలోని తీవ్రమైన సమస్యలను తగ్గించడంలో సూపర్‌గా పనిచేస్తుంది. పసుపుని ఏ విధంగా తీసుకున్న మీకు ప్రయోజనాలని అందిస్తుంది. పసుపును చాలా రకాలుగా ఉపయోగిస్తారు. చాలా మంది పసుపును పాలలో కలిపి తీసుకుంటారు. అసలైన పసుపులో దాగి ఉన్న యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని అనేక సమస్యలను తగ్గిస్తాయి.

ఇది కాకుండా గాయాలను నయం చేయడంలో పసుపు నీరు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థరైటిస్ వల్ల కలిగే మంట, చికాకును తగ్గించడంలో పసుపు నీరు ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీని కోసం మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు కలపాలి. ఈ పానీయం చేయడానికి తాజా పసుపు పొడిని ఉపయోగించాలి. ప్రారంభంలో పసుపు నీటి రుచి మీకు నచ్చక పోవచ్చు. కానీ కొన్ని రోజుల్లో మీరు దానికి అలవాటవుతారు. పసుపులో కర్కుమిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కణాలను రిపేర్ చేయడంలో పనిచేస్తుంది. 

Tags:    

Similar News