White Hair Tips: ఈ ఒక్కటి కలిపితే తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది!
White Hair Tips: ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి, వాతావరణ ప్రభావాలతో జుట్టు సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి.
White Hair Tips: ఈ ఒక్కటి కలిపితే తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది!
White Hair Tips: ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి, వాతావరణ ప్రభావాలతో జుట్టు సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. చిన్న వయసులోనే జుట్టు రాలడం, తెల్లబడటం లాంటివి సాధారణమయ్యాయి. ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్య అనేక మందిని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అయితే ఈ సమస్యకు ఇంట్లో ఉన్న సహజ పదార్థాలతో పరిష్కారం పొందవచ్చు.
ఇంట్లోనే సులభంగా దొరికే రెండు ముఖ్యమైన పదార్థాలు—పెరుగు మరియు కరివేపాకు పొడితో తెల్ల జుట్టును నల్లగా మార్చే సహజ చిట్కా అందుబాటులో ఉంది. పెరుగు జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉన్న ప్రోటీన్లు, లాక్టిక్ యాసిడ్, కొవ్వు ఆమ్లాలు జుట్టు కుదుళ్లకు ఆహారాన్ని అందించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. చుండ్రు సమస్యను కూడా తగ్గించడంలో పెరుగు కీలక పాత్ర పోషిస్తుంది.
ఇక కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ వంటి పోషకాలు జుట్టు నల్లగా మారడంలో సహాయపడతాయి. కరివేపాకును ఎండలో ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవాలి. ఆ తర్వాత రెండు చెంచాల కరివేపాకు పొడిని ఒక గిన్నె పెరుగులో కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి.
ఈ హెయిర్ ప్యాక్‌ను తలపై రెండు గంటలపాటు ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈ పద్ధతిని పాటిస్తే, జుట్టు సహజంగా నిగనిగలాడే నల్లగా మారటమే కాకుండా, చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.
పెరుగు, కరివేపాకు మిశ్రమం కావడంతో ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. సహజంగా తెల్ల జుట్టును సులభంగా నల్లగా మార్చవచ్చు. అయితే ఈ సమాచారం అవగాహన కోసం కల్పించిన విషయం. దీనిని hmtv న్యూస్ ధ్రువీకరించడం లేదు.