Onion Benefits: వేసవిలో ఉల్లిపాయ తప్పనిసరిగా తినండి.. ఎందుకంటే..?

Onion Benefits: ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Update: 2022-04-01 11:30 GMT

Onion Benefits: వేసవిలో ఉల్లిపాయ తప్పనిసరిగా తినండి.. ఎందుకంటే..?

Onion Benefits: ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. మరోవైపు ఉల్లిపాయలలో విటమిన్-బి, ఫోలేట్ (బి9), పిరిడోసిన్ (బి6) తగినంత మొత్తంలో ఉంటాయి. ఇవి మీ శరీరంలో జీవక్రియ, నరాల పనితీరు, ఎర్ర రక్త కణాలను పెంచడానికి పని చేస్తాయి. ఇది పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్, సల్ఫర్, ప్రోటీన్, ఖనిజాలకు మంచి మూలం.

ఉల్లిపాయ ప్రయోజనాలు

1. బ్లడ్ షుగర్ కంట్రోల్‌

ఉల్లిపాయల వినియోగం రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఒక పరిశోధనలో ఎర్ర ఉల్లిపాయల వినియోగం రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుందని తేలింది. అలాగే అవి శరీరంలో

హైపోగ్లైసీమిక్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది డయాబెటిక్ పేషెంట్లకు డైటరీ సప్లిమెంట్‌గా పని చేస్తుంది.

2. శరీరం చల్లదనాన్ని పొందుతుంది

ఉల్లిపాయ శీతలీకరణ ప్రభావం కారణంగా వేసవిలో దీనిని తినడం వల్ల చల్లదనాన్ని పొందుతాము. ఇది వేసవిలో మీ శరీర ఉష్ణోగ్రతను సాధారణంగా ఉంచడానికి సహాయపడుతుంది.

3. హీట్ స్ట్రోక్ నుంచి రక్షిస్తుంది

వేసవిలో వేడిని పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుంది. ఈ పరిస్థితిలో ఉల్లిపాయల వినియోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో తగినంత మొత్తంలో ద్రవాలు ఉంటాయి. ఇది రోజంతా మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అయితే ఉల్లిపాయల వినియోగం మీకు తక్కువ వేడిని కలిగిస్తుంది.

4. క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ

ఉల్లిపాయ, వెల్లుల్లి తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలను చాలా వరకు తగ్గించవచ్చు. ఒక పరిశోధనలో ఇవి తినే వ్యక్తులు క్యాన్సర్ నుంచి త్వరగా కోలుకుంటారని తేలింది.

5. కొలెస్ట్రాల్ కంట్రోల్‌

ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంటతో పోరాడటానికి, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. దీని కారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అలాగే ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

Tags:    

Similar News