Eggs: గుడ్లు వండేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా?
Eggs: గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రోటీన్ పుష్కలంగా ఉండే గుడ్లను అల్పాహారంగా తినచ్చు. రాత్రి భోజనంలో భాగంగా కూడా తీసుకోవచ్చు. అయితే చాలా మంది గుడ్లను ఎలా ఉడికించాలో తెలియక కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తారు. వాటివల్ల గుడ్ల రుచి పాడవుతుంది.
Eggs: గుడ్లు వండేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా?
Eggs: గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రోటీన్ పుష్కలంగా ఉండే గుడ్లను అల్పాహారంగా తినచ్చు. రాత్రి భోజనంలో భాగంగా కూడా తీసుకోవచ్చు. అయితే చాలా మంది గుడ్లను ఎలా ఉడికించాలో తెలియక కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తారు. వాటివల్ల గుడ్ల రుచి పాడవుతుంది. అందుకే గుడ్లు ఉడికించడంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే రుచి, ఆరోగ్యం బాగుంటుంది.
గుడ్లను ఎక్కువగా ఉడికించడం
చాలామంది గుడ్లను ఎక్కువగా ఉడికిస్తారు. దీంతో పసుపు సొన గోధుమ రంగులోకి మారుతుంది. అలాగే వాసన కూడా వస్తుంది. కాబట్టి మృదువుగా ఉడికిన గుడ్లు కావాలంటే 5 నిమిషాలు ఉడికించండి.
తాజా గుడ్లు వాడకపోవడం
గుడ్లు బయటకు చూస్తే బాగానే కనిపిస్తాయి కానీ అవి తాజా లేకపోతే రుచి, ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. కాబట్టి, తాజా గుడ్లు తీసుకోండి.
గుడ్లను అధిక వేడి మీద ఉడికించడం
గుడ్డు లాంటి వంటకాలు తక్కువ మంట మీద వండితేనే రుచిగా వస్తాయి. ఎక్కువ మంట మీద చేస్తే రుచి తగ్గిపోతుంది.
సుగంధ ద్రవ్యాలు
ఉప్పు, మిరియాలు వంటివి గుడ్డుకు సరైన సమయంలో కలపాలి. ముందుగానే ఉప్పు వేయడం మంచిది కాదు. ఇక మీదట గుడ్లు వండేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి. ఫలితం మీరు చూస్తారు.