Men Health: పురుషులు బలంగా ఉండాలంటే ఈ డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవాల్సిందే..!

Men Health: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

Update: 2022-05-17 13:30 GMT

Men Health: పురుషులు బలంగా ఉండాలంటే ఈ డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవాల్సిందే..!

Men Health: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. వీటి వల్ల శరీరం వ్యాధులకు దూరంగా ఉంటుంది. అదే సమయంలో కొన్ని డ్రై ఫ్రూట్స్ పురుషుల శక్తిని పెంచుతాయి. శారీరకంగా బలంగా చేస్తాయి. బలహీనమైన పురుషులు కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని నిత్యం తీసుకుంటూ ఉండాలి. అలాంటి కొన్ని డ్రై ఫ్రూట్స్ గురంచి తెలుసుకుందాం.

1. వాల్నట్

వాల్నట్స్‌ మెదడును పదునుగా మార్చడమే కాకుండా పురుషుల శక్తిని పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు రోజూ ఒకటి లేదా రెండు వాల్‌నట్‌లను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. దీన్ని తినడం వల్ల మీ వైవాహిక జీవితం బాగుంటుంది.

2. ఎండుద్రాక్ష

ఎండుద్రాక్ష పురుషులకు చాలా మేలు చేస్తుంది. ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇది మార్కెట్‌లో సులభంగా దొరుకుతుంది. విశేషమేమిటంటే ఇది చాలా ఖరీదైనది కాదు. ఈ పరిస్థితిలో మీరు ఖచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకోవాలి.

3. జీడిపప్పు

జీడిపప్పు రుచిగా ఉండటమే కాదు.. ఇతర గింజలతో పోలిస్తే ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. దీనిలో 82 శాతం కొవ్వుతోపాటు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఈ అసంతృప్త కొవ్వు ఆమ్లంలో 66 శాతం గుండెకు రక్షణ కల్పించే మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. జీడిపప్పులో ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

4. పిస్తాపప్పు

పిస్తాపప్పులో 4శాతం కేలరీలు మాత్రమే ఉంటాయి. అవి ఎల్-అర్జినైన్‌ను కలిగి ఉంటాయి. ఇది మీ ధమనుల్లో రక్త సరఫరా మంచిగా జరిగేలా చేస్తుంది. తద్వారా రక్తం గడ్డకట్టే అవకాశాలను తగ్గించి గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ శరీరానికి చాలా అవసరం. రోజులో ఐదు నుంచి ఏడు పిస్తాపప్పులు తింటే ఆరోగ్యానికి మంచిది. 

Tags:    

Similar News