Health Tips: జిమ్‌లో మహిళలకంటే పురుషులకే గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ..!

Health Tips: ఇటీవల చాలామంది ప్రముఖులు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

Update: 2022-09-04 12:30 GMT

Health Tips: జిమ్‌లో మహిళలకంటే పురుషులకే గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ..!

Health Tips: ఇటీవల చాలామంది ప్రముఖులు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఇందులో సింగర్ కెకె, కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, టీవీ నటుడు సిద్ధార్థ్ శుక్లా సహా పలువురు ఉన్నారు. వీళ్లందరి ఫిట్‌నెస్‌ బాగానే ఉంది అయినప్పటికీ గుండెపోటుకి గురవడం ఆశ్చర్యకరంగా ఉంది. కానీ మహిళల విషయంలో ఇలా జరగదు. ఎందుకంటే వారి శరీర విధానం వేరుగా ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చాలా మంది మహిళలు కుటుంబం, ఆఫీస్ బాధ్యతలు రెండింటినీ నిర్వహిస్తారు. దీని కారణంగా వారు రెట్టింపు ఒత్తిడికి గురవుతారు. కానీ అది వారి హృదయాన్ని పెద్దగా ప్రభావితం చేయదు. నిజానికి పీరియడ్స్ కారణంగా పురుషుల కంటే స్త్రీలు సురక్షితంగా ఉంటారు. మహిళల శరీరంలో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ల స్థాయి కొంత వయస్సు వరకు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. మెనోపాజ్ దశకు చేరుకున్న తర్వాత ఈ హార్మోన్ల స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. వాస్తవానికి ఈస్ట్రోజెన్ మహిళల రక్త నాళాలను మృదువుగా చేస్తుంది. దీని కారణంగా రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. దీంతో గుండెకు ఎటువంటి హాని ఉండదు.

వ్యాయామశాలలో జాగ్రత్తలు

పురుషులు తమ కండరాలని పెంచడానికి అధికంగా వ్యాయామం చేస్తారు. దీని కారణంగా గుండె వేగంగా పనిచేస్తుంది. అందువల్ల చాలాసార్లు గుండెపోటు వస్తుంది. అదే సమయంలో మహిళలు ఎక్కువగా కార్డియో, ఏరోబిక్, యోగాపై దృష్టి పెడతారు. తద్వారా వారి శరీరం సరైన ఆకృతిలో ఉంటుంది. కాబట్టి వారి గుండె ఎక్కువగా ఒత్తిడికి గురికాదు. అధిక వ్యాయామాలు వీరికి అవసరం ఉండదు. ఈ కారణంగా ఎటువంటి గుండె సమస్యలు ఉండవు.

Tags:    

Similar News