Garlic: ఇలాంటి వారు పొరపాటున కూడా వెల్లుల్లి తినకూడదు.. ఎందుకంటే..?

Garlic: భారతీయ వంటగదిని ఆయుర్వేద వైద్యానికి నిలయంగా పిలుస్తారు. ఏ రకమైన వ్యాధికైనా వంటగదిలోనే మందు దొరుకుతుంది.

Update: 2022-06-22 14:30 GMT

Garlic: ఇలాంటి వారు పొరపాటున కూడా వెల్లుల్లి తినకూడదు.. ఎందుకంటే..?

Garlic: భారతీయ వంటగదిని ఆయుర్వేద వైద్యానికి నిలయంగా పిలుస్తారు. ఏ రకమైన వ్యాధికైనా వంటగదిలోనే మందు దొరుకుతుంది. అందులో ముఖ్యమైనది వెల్లుల్లి. దీనికి చాలా శక్తి ఉంటుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హెర్బ్. పెద్ద పెద్ద వ్యాధులను కూడా నయం చేసే శక్తి దీనికి ఉందని అనేక పరిశోధనలు నిరూపించాయి. దీంతో పాటు ఇది ఆయుర్వేద చికిత్సకు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ కొంతమంది దీనికి దూరంగా ఉండటం మంచిది. అయితే ఎలాంటి వ్యక్తులు వెల్లుల్లికి దూరంగా ఉండాలో తెలుసుకుందాం.

మధుమేహం వ్యాధి గ్రస్తులు జాగ్రత్త

మధుమేహ వ్యాధిగ్రస్తులు వెల్లుల్లిని అధికంగా తీసుకోవడం హానికరం. ఎందుకంటే ఇది వారికి సమస్యలను కలిగిస్తుంది. వెల్లుల్లి అధికంగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తుంది. ఇది వారికి సమస్యలను కలిగిస్తుంది. తక్కువ మొత్తంలో తీసుకుంటే అది చక్కెరను నియంత్రిస్తుంది. కానీ ఎక్కువగా తీసుకుంటే అది మీకు హానికరం.

కాలేయ వ్యాధిగ్రస్తులు

కాలేయం, ప్రేగులు లేదా కడుపు సమస్యలు ఉన్నవారు వెల్లుల్లిని తినకూడదు. ఎందుకంటే వెల్లుల్లిలో ఉండే గుణాలు వాటిని ఇంకా పెంచుతాయి. అలాగే వ్యాధి నయం కావడానికి వాడే మందులకి వ్యతిరేకంగా పనిచేస్తాయి.

శస్త్రచికిత్స చేయించుకున్నవారు దూరంగా ఉండాలి

ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న వారు వెల్లుల్లిని తినకుండా ఉండాలి. ఎందుకంటే వెల్లుల్లి రక్తం పల్చగా చేస్తుంది. కాబట్టి ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న వారు తినకూడదు. ఎందుకంటే వారి గాయం ఇంకా పచ్చిగా ఉంటుంది. రక్తం పలచబడటం వల్ల గాయం నుంచి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News